భీం వారసుల కేరాఫ్ అడ్రస్ పెద్దదోబ గ్రామం

మన తెలంగాణ/సిర్పూర్(యు): జల్ జమీన్ జంగల్ కోసం పోరాడి అసువులు బాసిన కుమ్రం భీం వారసుల కేరఫ్ అడ్రస్‌గా మారిన  పెద్ద దోబ స్థితిగతులు మారడం లేదు. స్వరాష్ట్రంతో పాటు తాజాగా కుమ్రం భీం జిల్లాలోని సిర్పూర్(యు) మండలం పెద్దదోబ గ్రామంలో సుమారు 50 భీం వారసుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కుమ్రం భీం మనవడు కుమ్రం సోనేరావ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇటీ వల అన్ని రకాల ఆదుకోని బాసగా నిలిచినప్పటికి భీం వారసులు నివాసం ఉంటు […]

మన తెలంగాణ/సిర్పూర్(యు): జల్ జమీన్ జంగల్ కోసం పోరాడి అసువులు బాసిన కుమ్రం భీం వారసుల కేరఫ్ అడ్రస్‌గా మారిన  పెద్ద దోబ స్థితిగతులు మారడం లేదు. స్వరాష్ట్రంతో పాటు తాజాగా కుమ్రం భీం జిల్లాలోని సిర్పూర్(యు) మండలం పెద్దదోబ గ్రామంలో సుమారు 50 భీం వారసుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కుమ్రం భీం మనవడు కుమ్రం సోనేరావ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇటీ వల అన్ని రకాల ఆదుకోని బాసగా నిలిచినప్పటికి భీం వారసులు నివాసం ఉంటు న్న పెద్దదోబ గ్రామంపై ఫోకస్ పెట్టడం లేదని విమర్శలు వెలువె త్తుతు న్నాయి. భీం పోరాటం అనంతరం ముల్లే మూట సద్దకోని కెర మేరి అడవుల నుంచి నేరుగా సిర్పూర్(యు) మండలంలోని పెద్దదోబ గ్రా మానికి తరలివచ్చారు. సుమారు 50 కుటుంబాలు దశాబ్దలుగా ఆర కొర జీవితాలను వెల్లదిస్తున్నాయి. కుమ్రం భీం మనవడు సోనే రావ్‌తో పాటు భీం వారసులు ఉన్న కొద్ది పాటి భూమిని నమ్ముకోని కాలం గడుపుతున్నారు. దశాబ్దతల తర్వాత భీం వారసుల కష్టలను గుర్తించిన ప్రభుత్వం తొలివిడుతగా కుమ్రం భీం మనవడు సోనేరావ్ కుటుంబాన్ని దత్తత తీసుకోని వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని 5 ఎకరాల భూమిని ఇటివల అందించింది. అయితే పెద్దదోబను మోడల్ గ్రామం గా గుర్తిస్తామని పేర్కొన్నప్పటికి ఈ దిశగా మాత్రం అడుగులు వేయ డం లేదని విమర్శులు వెలువెత్తున్నాయి.

గ్రామంలో మంచి నీటి వసతి లేక ఒక వైపు సాగు నీటి వసతి లేక మరో వైపు కుమ్రం భీం వారసులు తంటాలు పడుతున్నారు. పోరు బిడ్డలు నివాసం ఉంటున్న పెద్దదోబలో కనీసం అంతర్గాత రహదాలు లేకపోవడంతో గ్రామస్థులకు అవస్థతలు తప్పడం లేదు. ప్రభుత్వం ఆసరా పింఛన్‌లు అందిస్తుండగా వారసుల కుటుంబాలు సుమారు 10 మందికి పింఛన్‌లు అందడం లేదు. పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన స్పందన కనరావడం లేదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీర చరిత్ర ఉన్న కుమ్రం భీం వారసుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటిస్తునే వీరి బతు కులు మారే అవకాశం ఉందంటున్నారు. సిర్పూర్(యు) మండలం పండిగి పంచాయతీలోని వచ్చే ఈ గ్రామం దుస్థితిపై కుమ్రం భీం మనవడు కుమ్రం సోనేరావు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లాడు,. అయితే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు చేపడుతున్న తెలం గాణ ప్రభుత్వం పెద్దదోబ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని డిమాండ్ వ్యక్తం అవుతుండగా ఆదివారం జోడే ఘాట్‌లో నిర్వహిం చనున్న కుమ్రం భీం వర్ధంతి సభలోనైన పెద్దదోబ గ్రామప్రగతికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి డబుల్‌బెడ్ రూం గృహాలతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: