అందాల ఆరబోతకు దూరం

చిత్ర పరిశ్రమలో సావిత్రి, సౌందర్య రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించాలంటే అందాలొలికించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే. గ్లామర్ షోలో ఎంత రెచ్చిపోతే అన్ని అవకాశాలు లభిస్తాయి. కానీ ఇప్పటికీ ఒకరిద్దరు తారలు పద్దతిగా నటిస్తామంటున్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగమ్మాయి శ్రీదివ్య. అందాల ఆరబోతకు నేను చాలా దూరమంటోంది ఈ భామ. రవిబాబు ‘మనసారా’ సినిమాతో పరిచయమైంది శ్రీదివ్య. బస్టాప్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీదివ్య తక్కువ […]

చిత్ర పరిశ్రమలో సావిత్రి, సౌందర్య రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించాలంటే అందాలొలికించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే. గ్లామర్ షోలో ఎంత రెచ్చిపోతే అన్ని అవకాశాలు లభిస్తాయి. కానీ ఇప్పటికీ ఒకరిద్దరు తారలు పద్దతిగా నటిస్తామంటున్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగమ్మాయి శ్రీదివ్య. అందాల ఆరబోతకు నేను చాలా దూరమంటోంది ఈ భామ. రవిబాబు ‘మనసారా’ సినిమాతో పరిచయమైంది శ్రీదివ్య. బస్టాప్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీదివ్య తక్కువ సమయంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ అయింది. శివకార్తికేయన్‌లాంటి కుర్ర హీరోలకు శ్రీదివ్య పర్‌ఫెక్ట్ జోడీగా మారింది. అయితే ఇన్ని అవకాశాలు వస్తున్నా… గ్లామర్ షోలో మాత్రం శ్రీ దివ్య తాను గీసుకున్న గిరి దాటడం లేదు. అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం అందాల ఆరబోతకు సై అనేదే లేదని తేగేసి చెబుతోంది. తమిళ్‌లో బిజీగా ఉంటూ అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది శ్రీదివ్య.

Related Stories: