బాల కార్మికతకు చట్టబద్ధత!

మార్కెట్ శక్తులు విద్యావ్యవస్థలో ప్రవేశించాయన్నది వాస్తవం. ప్రతి రాష్ట్రంలోను మార్కెట్ శక్తులు విద్యారంగంలో బలంగా స్ధిరపడ్డా యి. నేడు 300 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు ప్రయివేటు రంగంలో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో 60 శాతానికి మించి విద్యారంగం ప్రయివేటు పరమే. ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యాసంస్థలు సమస్యలతో సతమతమవుతున్నాయి. విద్యారంగంలో సంస్కరణలు అంటే ఇకముం దు అవి కూడా ఉదారీకరణ దిశగానే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టాల సంకెళ్ళు లేకపోవడం వల్ల ప్రైవేటు విశ్వ విద్యాలయాలు రాష్ట్ర […]

మార్కెట్ శక్తులు విద్యావ్యవస్థలో ప్రవేశించాయన్నది వాస్తవం. ప్రతి రాష్ట్రంలోను మార్కెట్ శక్తులు విద్యారంగంలో బలంగా స్ధిరపడ్డా యి. నేడు 300 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు ప్రయివేటు రంగంలో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో 60 శాతానికి మించి విద్యారంగం ప్రయివేటు పరమే. ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యాసంస్థలు సమస్యలతో సతమతమవుతున్నాయి. విద్యారంగంలో సంస్కరణలు అంటే ఇకముం దు అవి కూడా ఉదారీకరణ దిశగానే ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టాల సంకెళ్ళు లేకపోవడం వల్ల ప్రైవేటు విశ్వ విద్యాలయాలు రాష్ట్ర అసెంబ్లీల ద్వారా ఏర్పడ్డాయి. యూనివర్శిటీ గ్రాం ట్స్ కమిషన్ ఈ విశ్వవిద్యాలయాలను గుర్తించింది. కాని విచిత్రంగా బోధనాసిబ్బంది నియామకంలో ఈ విద్యాసంస్థలు యుజిసి నియమా లను పాటించవు. వృత్తి విద్యా కోర్సులను అందించే విద్యాసంస్థలపై చాలా ఎక్కువ నియంత్రణ ఉందని అనుకుంటాము కాని అక్కడ కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గాలేదు. ఇంజినీరింగ్, మెడిసిన్, టీచర్స్ ఎడ్యుకేషన్ వంటి వి జాతీయస్థాయి కౌన్సిళ్ళ నిర్వహణలో ఉన్నాయి. ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో వ్యాపించిందో చెప్పడానికి వ్యాపం స్కామొక్కటి చాలు.
ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు మానవవనరుల శాఖకు, రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు మధ్య ఒక వారధిగా ఉండేది. కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ చేసిన ప్రోగ్రాములు, జాతీయస్థాయిలో నడిచే ముఖ్యమైన విద్యాకార్యక్రమాల మధ్య సంయమనం ఉండేది. కాని ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కూడా లేదు. రాష్ట్రాలతో మానవవనరుల శాఖ ఎలా వ్యవహరించాలి.
మానవ వనరుల శాఖ పరిస్థితి ఇప్పుడు చాలా దయానీయంగా ఉందంటే పొరబాటు కాదు. కొత్తగా చేసిన బాల కార్మిక నియంత్రణచట్టం దానికి ఉదాహరణ. కుటుంబం నడిపే పరిశ్రమలో పిల్లలు పనిచేయవచ్చని అను మతించిన చట్టం. లేబర్ మార్కెటులోకి పిల్లలు ప్రవేశించేలా తలుపులు బార్లా తెరిచిన చట్టం. కొత్త విద్యా చట్టం రూపొందిస్తున్న సమయంలో ఈ కొత్త కార్మిక చట్టం సాధించిందేమిటి. విద్యాహక్కును నిరాకరించే చట్టం గా దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు మరో కొత్త నియమం తీసుకురావాలన్న ఆలోచన కూడా కనబడుతోంది. ఆరవ తరగతి తర్వాతి నుంచి ప్రతి సంవ త్సరం పాసవ్వడం కంపల్సరీ చేస్తున్నారు. స్మృతి ఇరానీ కూడా కొత్త విద్యా విధానం విషయంలో దీని గురించి చాలా సార్లు ప్రస్తావించారు. విద్యాహక్కు చట్టాన్ని సంస్కరించి, ఆరవ తరగతి తర్వాత ఫెయిల్ చేసే నిబంధన చేర్చితే విద్యావ్యవస్థలో నిరుపేదలకు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ఇక స్థానమే ఉండదని చెప్పవచ్చు. విద్యాహక్కు చట్టం ఎనిమిది సంవత్సరాల విద్యకు హామీ ఇస్తుంది. ఇప్పుడు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తే చాలా మంది నిరుపేదల పిల్లలు ఆరవతరగతిలోనే ఆగిపోతారు. వారి తల్లిదండ్రులు వారిని తమ కుటుంబ వ్యాపారంలోనో, పనిలోనో పెట్టడానికి అది కారణమవుతుంది. పధ్నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలు లేబర్ మార్కెటులోకి వచ్చే అవకాశం కూడా ఇప్పుడు ఉంది. అలాంటి పిల్లలనే పనిలో పెట్టుకోడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారికి తక్కువ జీతాలిచ్చి పనిచేయించుకోవచ్చు. ఇంతకు ముందు ప్రమాదకర పనుల జాబితాలో ఉన్న చాలా పనులను ఆ జాబితా నుంచి ఇప్పుడు తప్పించారు కూడా. ఈ కార్మికచట్టానికి మానవవనరుల శాఖ కనీసం అభ్యంతరం కూడా చెప్పలేకపోయింది. దేశంలో విద్యా రంగం యావత్తు కేవలం కొంతమంది చేతుల్లో ప్రయివేటీకరణ అవుతుం టే, మరోవైపు పేదల పిల్లలు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ఉదారీకరణ కార్మికుల హక్కులను కబళించ డమే కాదు, వారి పిల్లల విదాజ్ఞానాలను కూడా మింగేస్తోంది.

Comments

comments

Related Stories: