‘గేమింగ్ హార్డ్‌వేర్’కు మంచి రోజులు

ఈ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం,  ఐటి శాఖ కసరత్తు  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గేమింగ్, హార్డ్‌వేర్ పరిశ్రమలకు మరింతగా ప్రొత్సాహాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐటి రంగం గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో భారీగా విస్తరించడంతో ఐటికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు ముఖ్యంగా గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్, డిజైనింగ్ రంగాలకు ఆదరణ పెరుగుతోంది. సృజనాత్మకతను కోరకుంటున్న యువత ఎక్కువగా డిజైనింగ్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. యువత కోరుకుంటున్న విధంగా తెలంగాణలో వారికి అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం […]

ఈ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం,  ఐటి శాఖ కసరత్తు 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గేమింగ్, హార్డ్‌వేర్ పరిశ్రమలకు మరింతగా ప్రొత్సాహాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐటి రంగం గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో భారీగా విస్తరించడంతో ఐటికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు ముఖ్యంగా గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్, డిజైనింగ్ రంగాలకు ఆదరణ పెరుగుతోంది. సృజనాత్మకతను కోరకుంటున్న యువత ఎక్కువగా డిజైనింగ్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. యువత కోరుకుంటున్న విధంగా తెలంగాణలో వారికి అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఐటి పరంగా అన్ని అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ యువతకు కొదవ లేదు, అపార అవకాశాలను చేజిక్కించుకుంటూ బెంగళూరు, అమెరికా లాంటి ప్రాంతాలకు వారు వెళ్లి తెలుగు రాష్ట్రాల సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో హార్డ్‌వేర్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ఐటి శాఖ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ నూతన పారిశ్రామిక రంగం (టిఎస్ ఐపాస్) విజయవంతం కావడంతో ఆ తరహాలోనే ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమకు తగిన ప్రొత్సాహకాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ సమీపంలో 880 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మైక్రోమాక్స్, సెల్‌కాన్ వంటి సంస్థలు తెలంగాణలో మొబైల్‌ఫోన్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించాయి. హైటెక్‌సిటీలో ఇటీవలే ఇమేజ్ ఇంకుమేషన్ కేంద్రాన్ని మంత్రి కేటిఆర్ లాంఛనంగా ప్రారంభించారు కూడా. హార్డ్‌వేర్ రంగంతో పాటు కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలకు ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలను కల్పిస్తోంది. తెలంగాణలో గేమింగ్, యానిమేషన్ ప్రాజెక్టుల డిజైనింగ్‌లో మన వారి మేధస్సుకు ప్రపంచ దేశాలు అబ్బురపోతున్నాయి. రాష్ట్రంలో విస్తరిస్తున్న ఈ పరిశ్రమ ఇటీవల వచ్చిన పలు తెలుగు చలన చిత్రాల్లో మన వారి ‘యానిమేషన్’ ప్రతిభకు గీటు రాయిగా చెప్పక తప్పదు. చిన్నారుల టివీ సీరియల్ పోకిమాన్, చోటా బిమ్ సీరియళ్లు యానిమేషన్ ఇండస్ట్రి ప్రతి రూపాలే. చోటాబీమ్ పాత్ర సృష్టికర్త రాజీవ చిలుకాను ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ కృషి భేష్
కాగా పారిశ్రామిక పరంగా పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ రంగ ఎగుమతులకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అసోచోమ్, హై సియా, డిక్కి లాంటి సంస్థలు అభినందిస్తున్నాయి. ప్రభు త్వం కల్పిస్తున్న సౌకర్యాలతో రానున్న రోజుల్లో ఎలక్ట్రాని క్ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఇండి యా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షు డు ఎంఎస్. విద్యాశంకర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఉ త్పత్తి రంగాన్ని ప్రొత్సహిస్తే నిరుద్యోగ సమస్య ను ప్రభు త్వాలు చాలా వరకు నివారించినట్లేనన్నారు. తెలంగాణ లో స్టార్టప్ కల్చర్ విస్తరిస్తుండడంతో సుమారు 18 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడ్డారని ఆయన చెప్పారు.

Related Stories: