పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బలూచీల నిరసన ప్రదర్శనలు

లండన్: బ్రిటన్‌లో నివసిస్తున్న అనేకమంది బలూచీల, సింధీ ప్రజలు చైనా రాయబార కార్యాలయం ముందు చైనాకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. చైనా పాకిస్థాన్‌ల మధ్య 46 బిలియన్ల అమెరికన్ డాలర్లతో నిర్మిస్తున్న ఎకానమిక్ కారిడార్‌ను మానవహక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. జర్మనీలోని లీప్‌జిగ్‌లోను ఇలాంటి ప్రదర్శనే జరిగింది. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పథకాన్ని పాకిస్తాన్ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కారిడార్‌ను బలూచిస్తాన్‌లో నిర్మిస్తున్నారు. పాకిస్థాన్ బలవంతంగా ఈ కారిడార్‌ను బలూచిస్తాన్ ప్రజలపై […]

లండన్: బ్రిటన్‌లో నివసిస్తున్న అనేకమంది బలూచీల, సింధీ ప్రజలు చైనా రాయబార కార్యాలయం ముందు చైనాకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. చైనా పాకిస్థాన్‌ల మధ్య 46 బిలియన్ల అమెరికన్ డాలర్లతో నిర్మిస్తున్న ఎకానమిక్ కారిడార్‌ను మానవహక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. జర్మనీలోని లీప్‌జిగ్‌లోను ఇలాంటి ప్రదర్శనే జరిగింది. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పథకాన్ని పాకిస్తాన్ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కారిడార్‌ను బలూచిస్తాన్‌లో నిర్మిస్తున్నారు. పాకిస్థాన్ బలవంతంగా ఈ కారిడార్‌ను బలూచిస్తాన్ ప్రజలపై రుద్దుతోందని వారు ఆరోపించారు. బలూచ్ స్టూడెంట్స్ యూత్ అసోసియేషన్ ఈ కారిడార్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచ్ మానవహక్కుల కౌన్సిల్, వరల్డ్ సింధీ కాంగ్రేసు తదితర సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. విస్తృత స్థాయిలో ప్రపంచదృష్టిని ఆకర్షించడానికి, ప్రపంచ దేశాల మద్దతు పొందడానికి చైనా రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించాయి. బలూచిస్తాన్ జిందాబాద్, పాకిస్థాన్ ముర్దాబాద్ అన్న నినాదాలతో ప్రదర్శన కారులు హోరెత్తించారు. ఇటీవల బలూచిస్తాన్ సమస్యను ప్రస్తావించిన భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడం కూడా ఈ ప్రదర్శనల్లో వినబడింది.

Comments

comments

Related Stories: