జైషా అనారోగ్యంతో విచారణ ఆలస్యం

న్యూఢిల్లీ : ఒలింపిక్స్ మారథాన్ రేసులో భారత అధికారులు తనకు మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ అథ్లెట్ ఒపి జైషా చేసిన ఆరోపణలపై విచారణ ఆలస్యం కానుంది. రియో నుంచి తిరిగి వచ్చిన జైషాకు స్వయిన్ ఫ్లూ సోకింది. దీని నుంచి కోలుకోవడానికి కనీసం వారం రోజులైనా పట్టే అవకాశం ఉండడంతో ఆమె చేసిన ఆరోపణలపై విచారణ ఆలస్యం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. జైషా చేసిన ఆరోపణలపై మంగళవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ […]

న్యూఢిల్లీ : ఒలింపిక్స్ మారథాన్ రేసులో భారత అధికారులు తనకు మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ అథ్లెట్ ఒపి జైషా చేసిన ఆరోపణలపై విచారణ ఆలస్యం కానుంది. రియో నుంచి తిరిగి వచ్చిన జైషాకు స్వయిన్ ఫ్లూ సోకింది. దీని నుంచి కోలుకోవడానికి కనీసం వారం రోజులైనా పట్టే అవకాశం ఉండడంతో ఆమె చేసిన ఆరోపణలపై విచారణ ఆలస్యం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. జైషా చేసిన ఆరోపణలపై మంగళవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. రియో మారథాన్‌లో 89వ స్థానంలో నిలిచిన జైషా.. తనకు భారత అధికారులు కనీసం మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆరోపణలు చేయగా.. అలాంటి ఏర్పాట్లు వద్దని ఆమె ఒక రోజు ముందే చెప్పిందని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్‌ఐ) అన్నది.

Comments

comments

Related Stories: