ఒలంపిక్స్‌లో ‘భారతే’ చెత్తగా ఆడిన దేశం !

రియో ఒలంపిక్స్‌లో చెత్త చెత్తగా ఆడింది భారతదేశమేనని పలు విదేశీ మీడియా వ్యాఖానించింది. ‘రియో ఒలంపిక్స్‌లో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చింది భారతే’నని న్యూజీలాండ్ దినపత్రిక నోరు పారేసుకోగా, ‘ 120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండే రెండు పతకాలు తెచ్చుకున్నంత మాత్రాన ఘనంగా సంబురాలు జరుపుకుంటోంది.. ఇది ఎంత చిరాకు కలిగించే విషయం’అని ప్రముఖ బ్రిటీష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత ఘాటుగా విమర్శించి ట్వీటర్‌లో పోస్టు చేశాడు. దీంతోమోర్గాన్‌ చేసిన ట్వీట్‌పై […]

రియో ఒలంపిక్స్‌లో చెత్త చెత్తగా ఆడింది భారతదేశమేనని పలు విదేశీ మీడియా వ్యాఖానించింది. ‘రియో ఒలంపిక్స్‌లో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చింది భారతే’నని న్యూజీలాండ్ దినపత్రిక నోరు పారేసుకోగా, ‘ 120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండే రెండు పతకాలు తెచ్చుకున్నంత మాత్రాన ఘనంగా సంబురాలు జరుపుకుంటోంది.. ఇది ఎంత చిరాకు కలిగించే విషయం’అని ప్రముఖ బ్రిటీష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ మరింత ఘాటుగా విమర్శించి ట్వీటర్‌లో పోస్టు చేశాడు. దీంతోమోర్గాన్‌ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు.
మరోవైపు ‘ఒలింపిక్స్‌ ఇండియా వరెస్ట్‌ కంట్రీ’ అనే శీర్షికతో న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్‌ రెండు మెడల్స్‌ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. ఇక ఒక్క పతకం కూడా సాధించలేక చతికలపడిన పాకిస్థాన్‌ను మాత్రం లెక్కలోకే రాదంటూ తొక్కతీసేసింది.

Related Stories: