ఆత్మాహుతి దాడి చేసింది 14ఏళ్ల లోపు పిల్లలే!

అంకారా : టర్కీలోని ఘజియాన్‌టేప్ నగరంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందగా.. 69 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, వివాహ వేడుకను లక్షంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్కులని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అదివారం వెల్లడించారు. ఓ టీనేజర్ చేత దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. […]

అంకారా : టర్కీలోని ఘజియాన్‌టేప్ నగరంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 51 మంది మృతి చెందగా.. 69 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, వివాహ వేడుకను లక్షంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్కులని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అదివారం వెల్లడించారు.
ఓ టీనేజర్ చేత దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట హూయేగవాదులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్ చేపడుతున్నాయని తెలిపారు. భద్రతా బలగాలు ఘజియాన్‌టేప్ సరిహద్దు మార్గాలను మూసివేసి.. ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Comments

comments

Related Stories: