ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, తూప్రాన్, చేగుంట, జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్, జోగిపేట, పటాన్‌చెరు తదితర ప్రాంతాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గురువారం వేడుక లను జరిపారు. సోదరీ,సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ సంబరాలు ప్రతి ఇంటిలోనూ అంబరాన్నం టాయి. అక్క తమ్ముడికి, చెల్లులు అన్నయ్యకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. జిల్లాకలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్‌కు పలువురు […]

సంగారెడ్డి ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, తూప్రాన్, చేగుంట, జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్, జోగిపేట, పటాన్‌చెరు తదితర ప్రాంతాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గురువారం వేడుక లను జరిపారు. సోదరీ,సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ సంబరాలు ప్రతి ఇంటిలోనూ అంబరాన్నం టాయి. అక్క తమ్ముడికి, చెల్లులు అన్నయ్యకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. జిల్లాకలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్‌కు పలువురు రాఖీలు కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియ జేశారు. పలువురు చిన్నారులుకూడా రాఖీలు కట్టి శుభాకాంక్ష లు చెప్పారు. జిల్లా కోర్టులో రాఖీ పండగ సంబరాలు జరుపుకున్నారు. రాఖీలు కట్టుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: