భక్తులతో కిటకిట

కొల్లాపూర్: మండల పరిధిలోని సోమశిలలో జరుగుతున్న పుష్కరాలలో భాగంగా ప్రముఖ సినీ నటుడు, హిందుపూరం శాసన సభ్యులు నందమూరి బాల కృష్ణ గురువారం సందర్శంచి కృష్ణానదిలో పుణ్య స్నానం అచరించి తమ తల్లిదండ్రులకు తాతలకు నంచనాల మద్య బ్రహ్మణుల వేద మంత్రలతో పిండ ప్రధానం కార్యక్రమా ము నిర్వహించారు. దాదాపు 20నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణను చుసేందుకు భక్తులు ఎగప డ్డారు. యువకులు కేరింతలు కోడుతూ సెల్పీ తీసుకు న్నారు. అక్కడే విలేకర్ల సమావేశంలో […]

కొల్లాపూర్: మండల పరిధిలోని సోమశిలలో జరుగుతున్న పుష్కరాలలో భాగంగా ప్రముఖ సినీ నటుడు, హిందుపూరం శాసన సభ్యులు నందమూరి బాల కృష్ణ గురువారం సందర్శంచి కృష్ణానదిలో పుణ్య స్నానం అచరించి తమ తల్లిదండ్రులకు తాతలకు నంచనాల మద్య బ్రహ్మణుల వేద మంత్రలతో పిండ ప్రధానం కార్యక్రమా ము నిర్వహించారు. దాదాపు 20నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణను చుసేందుకు భక్తులు ఎగప డ్డారు. యువకులు కేరింతలు కోడుతూ సెల్పీ తీసుకు న్నారు. అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలం గాణ ప్రభుత్వం పుష్కరాలను చక్కగా నిర్వహిస్తుందన్నారు. ప్రాంతం చాలా అందంగా ఉందని చూడవల్సిన ప్రదేశం అన్నారు. ప్రజలు సుఖ సంతోషలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ద్వాదశ జ్యోతిర్నిలింగాలు కల్గిన శ్రీలలిత సోమేశ్వరుని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాలకృష్ణకు స్వాగతం పలికి పుష్కర ఘాటు దగ్గరకు వచ్చారు.
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్‌టిఆర్
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సిని నటుడు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కృష్ణా పుష్కరాలకు హాజరైన అనంతరం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూల మాల వేసి ఆయన మాట్లా డారు. పుష్కరాలకోసం ఇక్కడికి రావడం జరిగిందని ఆయ న అన్నారు. పేద ప్రజలకు ఎన్‌టిఆర్ చేసిన సేవాలు మరవలేనివని ఆయన వివరించారు. పటేల్ పట్వారి వ్యవ స్థను రద్దు చేసిన ఘనత ఆయనదే అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం తెచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చిన్ననిరంజన్ రావు, కొల్లాపూర్ జడ్పీటీసి హన్ముంత్‌నాయక్, గ్రామ సర్పంచ్ వెంకటస్వామి,కొల్లాపూర్ సింగిల్‌విండో చైర్మెన్ రఘుపతిరావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు హెచ్.రాజే ష్, నాయకులు నర్సింహ్మరావు,బాలస్వామి, ఆలయ కమి టి సభ్యులు గోవింద్‌రెడ్డి, అంజనేయులు, రాంమోహన్, రామకృష్ణ, టిడిపి నాయకులు శివనందం, కురుమయ్య, పవన్‌కుమార్‌శేట్టి, అధికారులు ఉన్నారు.
జటప్రోల్ ఘాట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మన తెలంగాణ/వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన కృష్ణాపుష్కరాలు వీపనగండ్ల మండంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదనడానికి భక్తుల రద్దియే నిదర్శనం. ఘాట్ల దగ్గర భక్తుల సౌకర్యార్థం ప్రభు త్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించిన పురాతన ఆల యాలు అభివృద్ధికి నోచుకోకపోవడం కారణంగా కృష్ణా తీరంలో ఆలయాలు ఉన్న సోమశిల, బీచుపల్లి ఘాట్లకు భక్తులు పోటెత్తారని పలువురు అంటున్నారు. గురువారం వీపనగండ్ల మండలంలోని జటప్రోల్ పుష్కరఘాట్‌ను జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సందర్శించి సిబ్బందికి తగు సూచన లు చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాల న్నారు. బాషాసంస్కృతిక సారధి కళాకారులు జటప్రోల్ ఘాట్ దగ్గర చెక్కభజన కార్యక్రమం ద్వారా భక్తులను ఉత్తేజ పరిచారు. పిల్లలు ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన శవర్ దగ్గర పుణ్యస్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. పలు వురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహించి నదిలో సూర్య నమ స్కారం చేశారు.
విజయవంతంగా కొనసాగుతున్న పుష్కరాలు
మన తెలంగాణ/కొల్లాపూర్: మండల పరిధిలోని సోమ శిలలో గురువారం భక్తుల రద్ది తగ్గలేదు. రాష్ట్ర నలుమూల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుండే భక్తులు తమ వాహనాలలో తరలివచ్చి పుష్కర స్నా నాలు అచరించి శ్రీలలిత సోమేశ్వరుని దర్శించుకు న్నారు. భక్తుల సందడితో సోమశిల ఘాట్లు జనసందోహం భారీగా కనబడి ఎటు చూసిన రద్ది కనిపించింది.భక్తులకు విశ్వ హిందూ పరిషత్, స్వచ్ఛసోమశిల, శ్రీసత్యసాయి సేవ సంస్థ, రెడ్ క్రాస్ సోసైటి ఆధ్వర్యంలో సేవాలు అందిం చారు. ఈసందర్బంగా సత్యసాయి సేవ సంస్థ భక్తులకు పులిహోర ప్యాకెట్స్ పంపీణీ చేశారు. ఆర్యావైశ్యసంఘం, మైత్రి వెలుమ సంఘం భక్తులకు అన్న దానం చేశారు. పుష్కరాలు పూర్తి కావడానికి దగ్గర పడుతుండంతో భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గ కుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువా రం రోజు 1లక్ష 35వేల భక్తులు వచ్చినట్లు అధికారులు అంచన వేశారు ఈకార్యక్రమంలో తహశీల్దార్‌లు పార్థసా రథి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస సూరి, ఎంపిడిఓ నాసర్‌రెడ్డి, విఆర్‌ఓ గోవింద్‌రెడ్డి,రాంమోహన్, రామకృష్ణ అంజనేయు లు, తిరుపాలు, రమణ, తదితరులు పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు
మనతెలంగాణ/గద్వాల/మల్ధకల్/అయిజ: కృష్ణా పుష్క రాల్లో భాగంగా గద్వాలలోని నదిఅగ్రహారం, పెద్దచింత రేవుల పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. పౌర్ణమి కావ డంతో జిల్లాలోని నలుమూలల నుండే కాకుండా హైదరా బాద్, కర్ణాటక, కర్నూల్, అనంతపురం తదితర ప్రాంతాల నుండి అశేషంగా తరలివస్తున్న భక్తులను చూసి కృష్ణమ్మ తరలించిపోతుంది. కృష్ణమ్మ తల్లిని స్మరిస్తూ పుష్కరునికి మననం చేసుకుంటూ ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తు న్నారు. నదీఅగ్రహారం, బీరెల్లి, తెలుగోనిపల్లి, రేకులపల్లి, పెద్దచింతరేవుల తదితర పుష్కర ఘాట్లలో పుష్కరోత్సవం వైభవంగా సాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ పుష్కరాలకు జనం పెరుగుతున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానమాచరిం చి చెంతనే ఉన్న ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తు న్నారు. స్నానం అనంతరం మహిళలు దీపాలు వెలగించి నదీమతల్లికి పూజలు నిర్వహించారు. మరికొందరు ప్రమి దలు నదిలోకి వదిలారు. భక్తులతో ఆలయాలు కిక్కిరిపో తున్నాయి. అలాగే ఘాట్ల పరిసరాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. గురువారం నియోజకవర్గంలోని నదిఅగ్రహారం, పెద్దచింత రేవులు, బీరెల్లి, రేకులపల్లి, తెలుగోనిపల్లి పుష్కరాల్లో సుమా రు 25వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికా రులు వెల్లడించారు.
ప్రముఖుల పుణ్యస్నానాలు..
పుష్కరాలు ప్రారంభమై ఏడో రోజు నది అగ్రహారం పుష్కర ఘాట్‌లకు ప్రముఖుల తాకిడి పెరిగింది. గురువారం ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమీషనర్ కోమలికృష్ణ, ప్రముఖ నవలా, సినీ రచయిత కొత్తురు విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి, కలెక్టరేట్ ఏఓ, వనపర్తి ఎంపిపి శంక ర్‌నాయక్‌లు పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
మేము సైతం…
కులమతాలకు అతీతంగా మేము సైతం కృష్ణమ్మ పుష్కర స్నానం చేస్తామని అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన ముస్లీం కుటుంబం నదీఅగ్రహారం ఘాట్‌లో పుష్క రస్నానం చేశారు. కుటుంబ సమేతంగా స్నానం ఆచరించి కుటుంబాన్ని చల్లగా చూడమ్మా.. అంటూ వేడుకున్నారు.
బీచుపల్లిలో ప్రముఖుల సందర్శన
మనతెలంగాణ/ నడిగడ్డ/ ఇటిక్యాల/ ఇటిక్యాలరూరల్:
అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముల్ల అనుభందానికి ప్రతీకగా నిలిచే శ్రావన పౌర్ణమి రాఖీ పండుగ నాడు మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనాలతో వీఐపీ, రెండు సాధారణ ఘాట్లు కిక్కిరిసిపోయ్యాయి. రాఖీ పౌర్ణమి నాడు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. 44వ జాతీయ రహదారి ఇరువైపుల ఏర్పాటు చేసిన సర్వీసు రహదారుల గుండా భక్తులను క్యూపద్దతిలో ఘాటువైపున కు పంపుతున్నారు. మధ్యాహ్నాం 3 గంటలకు భక్తుల సం ఖ్య రెండు లక్షలు దాటిందంటే భక్తుల తాకిడి ఎంత స్థాయి లో ఉందో ఊహించవచ్చు. భక్తుల సంఖ్య అధికంగా ఉండ డంతో జనాలను వీఐపీ ఘాట్లకు అనుమతిచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు ఘాట్ల వద్ద పితృదేవుళ్లకు పిండప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రముఖ తాకిడి…….: ఇదిలా ఉండగా పౌర్ణమి నాడు ప్రముఖులు బీచుపల్లి ఘాటును సందర్శించారు. ఆంధ్రప్ర దేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి ఐఏఎస్ గిరిధర్, ప్రముఖ సినీనటుడు విలన్ వేషాలు వేసే అశోక్‌కుమార్, విశాంత్ర ఐఏఎస్ అధికారి శంకర్, డీఐజీ అకున్‌సభర్వాల్ బీచుపల్లి ఘాటును సందర్శించారు. ఐఏఎస్ అధికారి గిరిధర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి శంకర్‌లు పుణ్యస్నా నాలు ఆచరించి పిండప్రధానాలు చేశారు. సినినటుడు అశోక్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు చేసి పితృదేవళ్లకు పిండప్రధానాలు చేసిన అనంతరం విలే కరులతో మాట్లాడుతూ తాను పండేళ్ల కిందట జరిగిన కృష్ణా పుష్కారాలకు బీచుపల్లికి రావడం జరిగిందని చెప్పా రు. అధేవిధంగా విజయవాడలోని కూడ పుష్కరాలకు వెళ్లి దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుంటానని అశోక్‌కుమార్ మన తెలంగాణకు తెలిపారు.
క్రైమ్ పోలీసుల పహారా: కృష్ణా పుష్కరాలకు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువగా తరలిరావడంతో జేబుదొంగలు బెడద కూడ మొదలైంది. దీనిని అరికట్టేందుకు ఎస్పీ రెమా రాజేశ్వరి బుధావారం నుంచి ప్రత్యేకంగా ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు,ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పా టు చేశారు. వీరు నిరంతరం మఫ్టీలో పహార కాస్తు దొంగల భరతం పడతారని డీఎస్పీ బాలకోఠి తెలిపారు.
తగ్గిన నీటి ఉదృద్ధితి: ఇదిలా ఉండగా ఏడవ రోజు భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ నదిలో మాత్రం నీరు వెనక్కి తగ్గి పోయింది. ఫలితంగా ఘాట్లలో సరిపడా నీళ్లు లేకపోవ డంతో స్నానాలు చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అధికారుల సమన్వయంతో: పుష్కరాలు మొదలై ఏడురో జులు గడచిపోయిన బీచుపల్లిలో భక్తులు చిన్న చిన్న అసౌ కర్యాలు మినహా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఘాటుకు చేరుకునే క్రమంలో భక్తులను ఒక క్రమపద్దతిలో ప్రత్కేకం గా ఏర్పాటు చేసిన సర్వీసు రహదారి గుండా అనుమతిస్తు ఎలాంటి తోపులాట లేకుండా కట్టడి చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన జేసీ రాంకి షన్, ఎస్పీ రెమారాజేశ్వరి, ఘాటు ప్రత్యేక పోలీసు అధి కారి బాలకోఠి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేప డుతున్నారు. అధేవిధంగా వైద్య, ఆర్‌డబ్లుఎస్, అగ్నిమా పక శాఖలకు చెందిన అధికారులతో పాటు వాలంటీర్లు కూడ భక్తులకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తు భక్తుల అభిమానాన్ని చూరగొంటున్నారు.
70వేలకు పైగా భక్తుల పుష్కర స్నానం
మన తెలంగాణ/మఖ్తల్: పవిత్ర కృష్ణ పుష్కరాలలో భాగం గా 7వ రోజు అయిన గురువారం నాడు మఖ్తల్ మండల పరిధిలోని పస్పుల పుష్కర ఘాట్ జనసముద్రం అయ్యి భక్తులతో కిటకిటలాడింది. పుష్కర స్నానానికి వేల సంఖ్య లో భక్తులు హాజరు కావడంతో అధికారులు అప్రమత్తం అ య్యి భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్ల కోసం పరుగులు తీశారు. పుష్కరాలలో భాగంగా కృష్ణ నదికి ఎగువ వైపు నుండి వరద తక్కువ కావడంతో నదిలో నీరు కాస్తా తగ్గిన భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలిరావడంతో గురువారం నాడు కృష్ణనదిలో ఏర్పాటు చేసిన మొదటి ఇనుమ గ్రిల్‌ను తొల గించి నది ఆగ్రంలోని చివరికి ఏర్పాటు చేయడంతో పుష్కర స్నానానికి వచ్చే భక్తులు ఏలాంటి ఇబ్బందులు పడకుండా సంతోషంతో కేరింతలు కొడుతూ పుష్కర స్నానం ఆచరిం చారు. నదికి వరద తగ్గిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు బుధవారం నాడు మొదటి గ్రిల్ వద్దే భక్తులకు పుష్కర స్నానం ఆచరించేందుకు చర్యలు చేపట్టారు. దాం తో కాస్తా ఇబ్బందులు పడిన భక్తులను దృష్టిలో ఉంచుకొని గురువారం నాడు భక్తుల తాకిడి చూసి అధికారులు అప్ర మత్తం అయ్యి మొదటి రక్షణ కవచాన్ని తొలగించడంతో పుష్కర స్నానానికి భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుం డా పోయింది. కృష్ణ పుష్కరాలలో భాగంగా పుష్కర స్నానా నికి భక్తులు హైద్రాబాద్‌తో పాటు కర్నాటకలోని పలు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తండోపతండా లుగా తరలివచ్చి పుష్కర స్నానాన్ని ఆచరించారు. పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు నది ఒడ్డున వెల సిన శ్రీ వల్లభపుర దత్తాపీఠం ఆలయ సిబ్బంది రఘురాం రెడ్డి, దత్తు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి భక్తులకు భోజనాన్ని వడ్డించారు.
పుష్కర పుణ్యం కోసమే వచ్చా:ఒక వృద్దురాలు
పవిత్ర కృష్ణ పుష్కరాలలో స్నానం ఆచరిస్తే పుష్కర పుణ్యం లభిస్తుందనే ఆశతోనే వయస్సు పైబడినప్పటికి శరీరం సహకరించకపోయిన పుష్కర స్నానం ఆచరించి పుష్కర పుణ్యం స్వంతం చేసుకోవాలనే లక్షంతో పస్పుల పుష్కర ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు రావడం జరిగిందని ఒక వృద్దురాలు తెలిపింది. ఆపపోపలు పడుతూ పుష్కర స్నానానికి వచ్చిన వృద్దురాలిని మన తెలంగాణ ప్రతినిధి పలకరించగా కర్నాటక రాష్ట్రం నుండి మఖ్తల్ మండలం లోని పస్పుల పుష్కర ఘాట్‌కు స్నానం ఆచరించేందుకు రావడం జరిగిందని ఆ వృద్దురాలు తెలిపింది.
పుష్కర ఘాట్ వద్ద రాఖీ పండుగ..
కృష్ణ పుష్కరాలలో భాగంగా గురువారం నాడు రాఖీ పం డుగ కావడంతో పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులు పుష్కర స్నానం అనంతరం పుష్కర ఘాట్ వద్ద రాఖీలు కట్టుకొని తమ సోదరభావాలను వ్యక్త పరిచారు. ఒకవైపు పుష్కర స్నానంతో మరోవైపు రాఖీ పండుగతో పస్పుల పుష్కర ఘాట్ కలకలలాడింది.
పుష్కర స్నానం ఆచరించిన అబ్కారీశాఖ కమిషనర్ ఎల్.వి రావు
కృష్ణ పుష్కరాలలో భాగంగా 7వ రోజు అయిన గురువారం నాడు మఖ్తల్ మండల పరిధిలోని పస్పుల పుష్కర ఘాట్‌ను అబ్కారీ శాఖ కమిషనర్ ఎల్.వి రావు సందర్శించి అనంత రం పుష్కర ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి నది ఒడ్డున వెలసిన వల్లభపుర దత్తాపీఠాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Stories: