‘ఘణపూర్’ను వరంగల్‌లోనే ఉంచాలి

*ఎమ్మెల్యే రాజయ్య ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలి *సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ నేతల డిమాండ్ జఫర్‌గడ్ : స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకపక్ష నిర్ణయంపై సిపిఐ, టిడిపి, కాం గ్రెస్ పార్టీల నాయకులు జువారి రమేష్, కూరపాటి చంద్రమౌళి, చిట్టిమేళ్ల కృష్ణమూ ర్తి, అన్నెబోయిన భిక్షపతి, రాపర్తి యాకయ్యలు మండిబడ్డారు. జనగామను జిల్లా గా ఏర్పాటు చేసి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గాన్ని విలీనం చేయాలనే ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు నిరసనగా […]

*ఎమ్మెల్యే రాజయ్య ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలి
*సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ నేతల డిమాండ్
జఫర్‌గడ్ : స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకపక్ష నిర్ణయంపై సిపిఐ, టిడిపి, కాం గ్రెస్ పార్టీల నాయకులు జువారి రమేష్, కూరపాటి చంద్రమౌళి, చిట్టిమేళ్ల కృష్ణమూ ర్తి, అన్నెబోయిన భిక్షపతి, రాపర్తి యాకయ్యలు మండిబడ్డారు. జనగామను జిల్లా గా ఏర్పాటు చేసి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గాన్ని విలీనం చేయాలనే ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంట ర్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం రాస్తారోకో సమాచారం తెలుసుకు ని దొడ్డిదారిన వెళ్లిపోవడం సిగ్గుటేటు అన్నారు. అనంతరం మండల కేంద్రంలో అఖిలపక్ష అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని తన ఒంటె ద్దు పోకడలతో పోగొట్టుకుని తన సొంత స్వలాభం కోసం నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎంఎల్‌ఎ పదవీని కూడా కోల్పోవడం ఖాయం మన్నారు. రవాణ, వాణిజ్య వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న వరంగల్ జిల్లా నుంచి జనగామ జిల్లా కాకముందే తప్పడు ప్రకటనలు చేయడం, జఫర్‌గడ్ మండలం అన్ని రంగాల్లో అమడదూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయ కుండా ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వైస్ ఎంపిపి కాసర్ల ఎల్లయ్య, సిపిఐ జిల్లా సమితీ సభ్యులు బొమ్మినేని వెంకట్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి ఎండి జాఫర్, కూరపాటి విజయకుమార్, మొట్టుక ఎల్ల య్య, కుక్కల ఎల్లయ్య, ఇల్లందుల బాబు, రంగు సారంగపాణి, జిడ్డి రాజహంసం, సోమనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: