సెమీస్‌లో సానియా జోడీ

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సానియామీర్జా-రోహన్ బోపన్న అంచనాలు అందుకుంటూ పతకం దిశగా దూసుకెళ్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో బ్రిటన్ జంట ఆండీముర్రే-హీదర్‌వాట్సన్‌పై వరుస సెట్లలో నెగ్గి భారత జోడీ పతకానికి మరో విజయం దూరంలో నిలిచింది. నాల్గోసీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ 6-4, 6-4తో క్వార్టర్‌ఫైనల్‌ను 68 నిమిషాల్లోనే ముగించింది. తొలిసెట్ రెండోగేమ్‌లోనే సర్వీస్ కోల్పోయి 0-2తో వెనుకబడిన భారత జోడీ మూడోగేమ్‌తో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఏడోగేమ్‌లో […]

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సానియామీర్జా-రోహన్ బోపన్న అంచనాలు అందుకుంటూ పతకం దిశగా దూసుకెళ్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో బ్రిటన్ జంట ఆండీముర్రే-హీదర్‌వాట్సన్‌పై వరుస సెట్లలో నెగ్గి భారత జోడీ పతకానికి మరో విజయం దూరంలో నిలిచింది. నాల్గోసీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ 6-4, 6-4తో క్వార్టర్‌ఫైనల్‌ను 68 నిమిషాల్లోనే ముగించింది. తొలిసెట్ రెండోగేమ్‌లోనే సర్వీస్ కోల్పోయి 0-2తో వెనుకబడిన భారత జోడీ మూడోగేమ్‌తో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఏడోగేమ్‌లో మరోసారి ప్రత్యర్థిసర్వీస్ బ్రేక్ చేసి 4-3తో నిలిచిన భారత జోడీ తరువాత తమ రెండు సర్వీస్‌లూ కాపాడుకొని మ్యాచ్‌లో బోణీ చేసింది. ఇక రెండోసెట్‌లో తొలినాలుగు గేమ్‌లలో చెరో రెండు నెగ్గడంతో స్కోరు 2-2తో నిలిచింది. అయితే ఐదోగేమ్‌లో బ్రిటన్ జంట సర్వీస్ బ్రేక్ చేసి ఆధిక్యాన్ని సాధించిన భారత జంట సునాయాంగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో సానియా-రోహన్‌బోపన్న జోడీ వీనస్ విలియమ్స్-రాజీవ్‌రామ్ ద్వయంతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ జోడీకి కనీసం రజతం ఖాయం కానుంది. ఓడినా కాంస్య కోసం మరో మ్యాచ్ ఆడనుంది.

Related Stories: