అఫ్ఘాన్‌కు మరిన్ని యుద్ధ విమానాలు అవసరం

భారత్‌కు అమెరికా కమాండర్ నికల్సన్ విజ్ఞప్తి  న్యూఢిల్లీ : భారత దేశం నుంచి మరింతగా సైనిక సరఫరాలను అఫ్ఘనిస్థాన్ కోరింది. దాడులు జరిపే హెలికాప్టర్లతో సహా అఫ్ఘని స్థాన్‌లోని భద్రతా దళాలకు మరిన్ని ఆయుధ సరఫరాలు అందించాలని అమెరికా కోరతున్న ట్లు ఉన్నత స్థాయి అమెరికన్ కమాండర్ జనరల్ జాన్ నికల్సన్ చెప్పారు. ఆయన ఆదేశంలో అమెరికా కార్యకలా పాలను పర్యవేక్షిస్తున్నారు. భారత దేశం ఈ సరికే నాలుగు ఎంఐ- 25 హెలికాప్టర్లను ఆఫ్ఘాన్‌కు పంపింది. అయితే […]

భారత్‌కు అమెరికా కమాండర్ నికల్సన్ విజ్ఞప్తి 

న్యూఢిల్లీ : భారత దేశం నుంచి మరింతగా సైనిక సరఫరాలను అఫ్ఘనిస్థాన్ కోరింది. దాడులు జరిపే హెలికాప్టర్లతో సహా అఫ్ఘని స్థాన్‌లోని భద్రతా దళాలకు మరిన్ని ఆయుధ సరఫరాలు అందించాలని అమెరికా కోరతున్న ట్లు ఉన్నత స్థాయి అమెరికన్ కమాండర్ జనరల్ జాన్ నికల్సన్ చెప్పారు. ఆయన ఆదేశంలో అమెరికా కార్యకలా పాలను పర్యవేక్షిస్తున్నారు. భారత దేశం ఈ సరికే నాలుగు ఎంఐ- 25 హెలికాప్టర్లను ఆఫ్ఘాన్‌కు పంపింది. అయితే తాలిబన్ తదితర టెర్రర్ సంస్థలతో వ్యవహరించడానికి మరిన్ని యుద్ధ విమానాలు అవసరపడతా యని ఆయన చెప్పారు. ఆ దేశంలో శాంతి పునరుద్ధరణకు భారత్ సేవలను నికల్సన్ కొనియా డారు. హకాని నెట్‌వర్క్, లష్కర్, జైష్ ఏ మహ్మద్ వంటి టెర్రర్ గ్రూపులను కేవలం ఆ దేశానికే కాక భారత్‌తో సహా ఇరుగు పొరుగు దేశాలకు ప్రమాదకరంగా పరిణమించాయని ఆయన హెచ్చరించారు.
ఆయన భారత్‌లో రెండోసారి పర్యటిస్తున్నారు. జాతీయ భద్ర తా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, రక్షణ కార్యదర్శి జి.మోహన్ కుమార్‌తో సమావేశమై అఫ్ఘాన్ పరిస్థితిని లోతుగా చర్చించారు. వేలాది మంది అఫ్ఘాన్ భద్రతా దళాలకు భారత్ సైనిక శిక్షణను అందించడతో ఆ దేశానికి చాలా ప్రయోజనాలు కలిగాయని ఇది నాటో లక్షాలకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో తాలిబన్‌ల కు అడ్డాలు వున్నట్లు ఆయన చెప్పారు. తమ సొంత గడ్డ మీదుగా సాగుతున్న టెర్రరిస్టు సంస్థల కార్యకలాపాలకు నియంత్రించాల్సిందిగా పాక్ ప్రభుత్వా న్ని అమె రికా కోరిందని కూడా నికల్సన్ చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం అణచి వేతలో పాకిస్థాన్‌కు అమెరికా మద్దతు ఇస్తోందని వివరించారు.

Related Stories: