రియలిస్టిక్ కథతో ‘పెళ్లి చూపులు’

డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మాతలుగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా  రూపొందిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తరుణ్‌భాస్కర్ చెప్పిన సినిమా విశేషాలు… ఆవిధంగా సినిమా ప్రారంభమైంది… పెళ్లి చూపులు కథ రాసుకున్న తర్వాత ముందు సురేష్‌బాబుకే ఈ కథ చెప్పాను. అంతా విన్న ఆయన సెకండాఫ్‌లో ఇంకాస్త బెటర్‌గా ఉంటే ఇంకా బావుంటుందని అన్నారు. ఆయనే నిర్మాత […]

డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మాతలుగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా  రూపొందిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తరుణ్‌భాస్కర్ చెప్పిన సినిమా విశేషాలు…

ఆవిధంగా సినిమా ప్రారంభమైంది…
పెళ్లి చూపులు కథ రాసుకున్న తర్వాత ముందు సురేష్‌బాబుకే ఈ కథ చెప్పాను. అంతా విన్న ఆయన సెకండాఫ్‌లో ఇంకాస్త బెటర్‌గా ఉంటే ఇంకా బావుంటుందని అన్నారు. ఆయనే నిర్మాత రాజ్ కందుకూరికి ఫోన్ చేసి నా గురించి చెప్పి కథ వినమన్నారు. ఆతర్వాత నేను విజయ్ దేవరకొండ ద్వారా రాజ్‌కందుకూరిని కలిసి కథ చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. దాంతో పెళ్లిచూపులు సినిమా ప్రారంభమైంది.
డిఫరెంట్ మూవీ…
గత కొంతకాలంగా తెలుగులో ఎక్కువగా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సినిమాలు వస్తున్నాయి. ఆమధ్యన వచ్చిన ‘రఘువరన్ బి.టెక్’ ఎంతో రియలిస్టిక్‌గా అనిపించింది. అటువంటి కథతో సినిమా చేయాలని ఆలోచించాను. ఆ ఆలోచన నుండి పుట్టిన కథే ఈ ‘పెళ్లి చూపులు’.
సందర్భానికి అనుగుణంగా…
ఇంతకుముందు నేను ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ స్టయిల్‌లోనే ‘పెళ్లి చూపులు’ మూవీ చేయడం జరిగింది. సినిమాలో సందర్భానికి అనుగుణంగా స్పందిస్తూ నటీనటులు డైలాగ్స్ చెప్పడం జరిగింది. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటా రోనని భయ పడ్డాను. అయితే సురేష్‌బాబు ఈ సినిమా చూసిన తర్వాత ఏం టెన్షన్ పడవద్దు అని ధైర్యం చెప్పారు.
చివరకు ‘పెళ్లిచూపులు’ టైటిల్ పెట్టాం…
నేను డైరెక్ట్ చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్ టైటిల్‌నే ఈ సినిమాకు పెట్టాలనుకున్నాం. అయితే వేరే వాళ్లు ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేసేశారు. అప్పుడు వివాహ భోజనంబు అనే టైటిల్ అనుకున్నాం కానీ చివరకు ‘పెళ్లి చూపులు’ టైటిల్ సరిపోతుందని అనిపించింది దీన్ని ఫైనల్ చేశాం.
నెక్స్ మూవీ…
నా నెక్స్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో డిఫరెంట్‌గా ఈ మూవీ చేయాలనుకుంటున్నాను.

Related Stories: