విజయమే లక్షంగా..

నేటి నుంచి భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ బసెటెరె : వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లిసేన మరో సన్నాహాక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుతో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు సిరీస్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుతోనే జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన టీమిండియా తమ తప్పులను సరిదిద్దుకోవడానికి […]

నేటి నుంచి భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్

బసెటెరె : వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లిసేన మరో సన్నాహాక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుతో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు సిరీస్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుతోనే జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన టీమిండియా తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే చివరి అవకాశం. గాయంతో ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమైన ప్రధాన పేసర్ షమి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పర్వలేదనిపించినా సుదీర్ఘ స్పెల్ వేయడంలో తడబాటుకు గురయ్యాడు. ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న భువనేశ్వర్‌దీ ఇదేపరిస్థితి. ఈ మ్యాచ్‌లో ముంబయి పేసర్ శార్దుల్ ఠాకూర్‌ను జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించవచ్చు. ఇక గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్ అమిత్ స్థానంలో ఆఫ్‌స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు బౌలింగ్ ప్రాక్టీస్ కల్పించే అవకాశం ఉంది. టెస్టుల్లో నిలకడలేని ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్ శిఖర్‌ధావన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మకు తోడు లోకేశ్ రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధశతకాలతో ఫామ్‌ను అందుకున్నారు. పుజారా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడినా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడగా, కోహ్లి, రహానె తక్కువస్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో వీరి ముగ్గురితో పాటు ఓపెనర్ మురళీవిజయ్‌లకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగానే 21న మొదలయ్యే తొలిటెస్టుకు తుది జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.

Related Stories: