రియోకు మన సైన్యం 120

2008 బీజింగ్ ఒలింపిక్స్.. 3 పతకాలు.. 2012 లండన్ ఒలింపిక్స్.. 6 పతకాలు.. మరి 2016 రియో ఒలింపిక్స్ పతకాలెన్నో?.. దీనికి సమాధానం ఈసారి విశ్వక్రీడల్లో మన పతకాలు రెండంకెల స్కోరు దాటేలానే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా, తొలిసారి 120 మంది సైనికుల(అథ్లెటీలు)తో ఈసారి ఒలింపిక్స్‌లో  బరిలోకి దిగుతోంది. ఈ సైనికులలో చాలా మందిపై మనకు పతక ఆశలు కూడా ఉన్నాయండోయ్.. క్రీడావిభాగం:  ఒలింపిక్స్.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా సంబురం. అయితే ఈ విశ్వక్రీడల్లో మన […]

2008 బీజింగ్ ఒలింపిక్స్.. 3 పతకాలు.. 2012 లండన్ ఒలింపిక్స్.. 6 పతకాలు.. మరి 2016 రియో ఒలింపిక్స్ పతకాలెన్నో?.. దీనికి సమాధానం ఈసారి విశ్వక్రీడల్లో మన పతకాలు రెండంకెల స్కోరు దాటేలానే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా, తొలిసారి 120 మంది సైనికుల(అథ్లెటీలు)తో ఈసారి ఒలింపిక్స్‌లో  బరిలోకి దిగుతోంది. ఈ సైనికులలో చాలా మందిపై మనకు పతక ఆశలు కూడా ఉన్నాయండోయ్..

క్రీడావిభాగం: 

ఒలింపిక్స్.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా సంబురం. అయితే ఈ విశ్వక్రీడల్లో మన అథ్లెటీలు ఒక్క పతకం కాదు కదా.. అర్హత సాధించడానికే అపసోపాలు పడేవారు గతంలో. కానీ.. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. గత రెండు ఒలింపిక్స్‌లో మన అథ్లెల ప్రాతినిధ్యమే కాదు.. పతకాలు తెచ్చారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 56 మంది అథ్లెటీలతో పాల్గొన్న భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. షూటింగ్‌లో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణం కూడా ఉంది. 2012 ఒలింపిక్స్‌కు 83 మంది భారత అథ్లెటీలు ప్రాతినిధ్యం వహిస్తే.. ఆరు పతకాలు వస్తాయి. వీటిలో స్వర్ణం దక్కకపోయినా పతకాలు సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రియో ఒలింపిక్స్‌లో భారత్.. ఏకంగా 120 మంది సైన్యంతో బరిలోకి దిగుతోంది. మన అథ్లెటీల జోరు చూస్తుంటే పతకాలు కూడా రెండంకెల స్కోరు దాటేలా కనిస్తున్నాయి. గత రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌తో పాటు హాకీ, అథ్లెటీలో మనకు పతకాలు దక్కేలా ఉన్నాయి. గత మూడేళ్లుగా ప్రాతినిధ్యం వహించిన ప్రతి టోర్నీలోనూ కనీసం ఏదో ఓ పతకం నెగ్గిన జితురాయ్, అపూర్వి చండేలాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక చివరి ఒలింపిక్స్ ఆడుతున్న అభినవ్ బింద్రాతో పాటు హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్‌పై కూడా ఆశలు ఉన్నాయి. రెజ్లింగ్‌లోనూ యోగేశ్వర్‌దత్, నర్సింగ్‌యాదవ్, వినేశ్‌పోగట్‌లకు పతకాలు తెచ్చే సామర్థం ఉంది. బ్యాడ్మింటన్‌లో అయితే భారత్‌కు ఒక పతకం ఖాయమనే భావన ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య నెగ్గిన సైనా నెహ్వాల్‌తో పాటు సింధు పతకం ఆశలు రేపుతున్నారు. ఇక అద్భుత ఫామ్‌తో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న పురుషుల హాకీ జట్టుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ భారత్ ఒకటి రెండు పతకాలు దక్కవచ్చు. చివర్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన(3 నిమిషాల 0.9సె॥) నమోదుచేసిన భారత పురుషుల 4×400 రిలే జట్టు అదే ప్రదర్శన చేస్తే పునరావృతం చేస్తే భారత్‌కు ఏదో ఒక పతకం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆశలు రేపుతున్న అథ్లెటీలు పతకాలు సాధిస్తారో.. లేదో.. మరో 23 రోజుల తరువాతే తెలుస్తుంది.

Related Stories: