కొండెక్కుతున్న పశు వైద్యం

* సీజనల్ వ్యాధులపై అవగాహన లోపం * జోగిపేటలో వృధాగా రైతు శిక్షణ, విస్తరణ కేంద్రం జోగిపేట : దేశానికి రైతు వెన్నుముక్క అన్ని చెప్పుకోవడం తప్ప రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంతా మాత్రమేగానే ఉంటున్నాయి. ముఖ్యంగా పశు సంవర్థక శాఖలో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. వర్షాకాలంలో పశువులకు సీజనల్‌గా సోకే వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించేందుకు కావాల్సిన సిబ్బంది ఆ శాఖలో లేరు. దీంతో రైతులు […]

* సీజనల్ వ్యాధులపై అవగాహన లోపం
* జోగిపేటలో వృధాగా రైతు శిక్షణ, విస్తరణ కేంద్రం
జోగిపేట : దేశానికి రైతు వెన్నుముక్క అన్ని చెప్పుకోవడం తప్ప రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంతా మాత్రమేగానే ఉంటున్నాయి. ముఖ్యంగా పశు సంవర్థక శాఖలో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. వర్షాకాలంలో పశువులకు సీజనల్‌గా సోకే వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించేందుకు కావాల్సిన సిబ్బంది ఆ శాఖలో లేరు. దీంతో రైతులు నానా తంటాలు పడుతు న్నారు. అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటతో పాటు పుల్‌కల్, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ తదితర మండలాల్లోని పశు వైద్య శాలల్లో డాక్టర్ల, సిబ్బంది కొరత ఉన్నది. డాక్టర్ ఉన్న చోట సిబ్బంది, సిబ్బంది ఉన్న చోట డాక్టర్ లేరు. ఇలా పశు ఆస్పత్రుల్లో వైద్య కొండెక్కుతున్నది. కాగా, పశువులకు సోకే వ్యాధుల నిర్మూలన కోసం జోగిపేటలో రూ.60 లక్షల వయ్యంతో నాబార్డు నిధుల ద్వారా పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏడి స్థాయి అధికారితో పాటు డాక్టర్, కంపౌండర్ ఇతర సిబ్బంది ఉండాలి. కానీ అధికారులు, సిబ్బంది కొరత నెలకొన్నది. ఇదే భవనంలో పశువులు, గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే, మూగజీవాలు, పశువుల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నప్పటికి సరైన సిబ్బంది లేక ఎప్పుడు చూసిన భవనానికి తాళం వేసి ఉంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా పశు సంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. త్వద్వారా తమ ఇబ్బందులను తొలగించి, పశువులకు, మూగ జీవాలకు కావాల్సిన వైద్య సేవలను మెరుగు పరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Stories: