బిగ్‌బాష్‌లో హర్మన్ ప్రీత్ కౌర్

న్యూఢిల్లీ : ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ విదేశీ టి-20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ వచ్చే సీజన్ కోసం హర్మన్ ప్రీత్ కౌర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా బాగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చే సీజన్‌లో ప్రాతినిధ్యం వహించనుందని ధర్మశాలలో జరుగుతున్న బిసిసిఐ వర్కింగ్ కమిటీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ […]

న్యూఢిల్లీ : ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ విదేశీ టి-20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ వచ్చే సీజన్ కోసం హర్మన్ ప్రీత్ కౌర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా బాగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చే సీజన్‌లో ప్రాతినిధ్యం వహించనుందని ధర్మశాలలో జరుగుతున్న బిసిసిఐ వర్కింగ్ కమిటీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశాడు. ఈ నెల ప్రారంభంలోనే భారత మహిళా క్రికెటర్లు విదేశీ టి-20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టీమిండియా వైస్ కెప్టెన్ కొనసాగుతున్న హర్మన్‌ప్రీత్‌కు మూడు ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చినా ఆమె మాత్రం సిడ్నీ థండర్స్ తరుపున ఆడేందుకు మొగ్గు చూపింది. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన మూడు టి-20ల సిరీస్‌ను భారత్ నెగ్గడంలో హర్మన్‌ప్రీత్‌కౌర్ కీలక పాత్ర పోషించడంతో బాగ్‌బాష్ నిర్వాహకులు ఆమెపై ఆసక్తి చూపించారు.

Related Stories: