భారత్‌లో సామాజిక సమస్యలపై అమెరికా చర్చించాలి

మత అసహనం, భావప్రకటన స్వేచ్ఛ లేకపోవడంపై మానవ హక్కుల నేతల సూచన వాషింగ్టన్: భారతదేశంలో రెండేళ్ల మోడీప్రభుత్వ హయాంలో మతస్వేచ్ఛ, మానవ హక్కులు క్షీణించాయని మానవహక్కుల సంస్థ కార్యకర్త సిప్టాన్ విమర్శించారు. ఈ అంశాన్ని భారతదేశంలో క్రమం తప్పకుండా అమెరికా జరిపే చర్చలలో అంతర్భాగం చేయాలని ఆయన సూచిం చా రు. ‘పౌరులందరకు సమానంగా మంచి జీవితాన్ని ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే భారతదేశంలో మానవహక్కులు మరింతగా క్షీణిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఆ […]

మత అసహనం, భావప్రకటన స్వేచ్ఛ లేకపోవడంపై మానవ హక్కుల నేతల సూచన

వాషింగ్టన్: భారతదేశంలో రెండేళ్ల మోడీప్రభుత్వ హయాంలో మతస్వేచ్ఛ, మానవ హక్కులు క్షీణించాయని మానవహక్కుల సంస్థ కార్యకర్త సిప్టాన్ విమర్శించారు. ఈ అంశాన్ని భారతదేశంలో క్రమం తప్పకుండా అమెరికా జరిపే చర్చలలో అంతర్భాగం చేయాలని ఆయన సూచిం చా రు.
‘పౌరులందరకు సమానంగా మంచి జీవితాన్ని ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే భారతదేశంలో మానవహక్కులు మరింతగా క్షీణిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఆ దేశంలో బలహీన సామాజిక వర్గాలవారును సంరక్షిస్తూ, భావప్రకటనా స్వేచ్ఛను, అసంతృప్తి వ్యక్తీకరణను అనుమతించే వాతావరణం నెలకొల్పాలని మానవ హక్కుల నిఘా సంస్థ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆసియా విభాగం డైరెక్టర్ జాన్ సిప్టాన్ సూచించారు. చట్టాలను, విధానాలను సమర్థంగా అమలు పరచే వాతావరణం లేకపోవడం ఒక సవాలుగా మారిం దని సిప్టాన్ అన్నారు. ‘భారత దేశంలో మానవ హక్కుల పురోగమనానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై విచారణలో ఆయన పాల్గొన్నారు. టామ్ లాంటన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మంగళవారంనాడు ఈ సమావేశం జరిపింది. అక్కడ ఇటువంటి పరిస్థితి నెలకొనటానికి అధికారుల లో జవాబుదారీ తనం లోపించడం, పోలీసు తదితర కీలక విభా గాల అధికారులు చెత్త నిబంధనలనుండి రక్షణకవచం ఉండడం కారణమని ఆయన చెప్పారు.
‘ఈ కీలక అంశాల గురించి భారత ప్రభుత్వంతో అమెరికా చర్చించేలా కాంగ్రెస్ సభ్యులు చొరవ చూపిం చాలి. నేరుగా భారతప్రభుత్వాన్ని సంప్రదించాలి. రానున్న కాలమంతా దీనిపై దృష్టిపెట్టాలి. అని సిప్టాన్ ఆ విచారణలో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చలు జరిపిన వెనువెంటనే ఈ సమావేశం జరిగింది.
ఆయా నేరాలలో భారతప్రభుత్వ ప్రమేయం నేరుగా లేదు. కాని ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వ అధికారులు ఆ ఘటనలపట్ల మౌనం వహించారని అంతర్జాతీయ క్రైస్తవ ఆందోళనల సంస్థ అధ్యక్షుడు జఫ్‌కింగ్ పేర్కొన్నారు. భద్రత, రక్షణ, ఆర్థిక సహకారం వంటి అంశాలకు అతీతంగా ఈ అంశాలపై వాణిజ్య చర్చలలో భాగంగా సంప్రదింపులు జరగాలని ఆయన కోరారు. ఇరు దేశాలు ప్రజాస్వామ్యం, మతస్వేచ్ఛ, చట్టాల అమలులో తాము పాటించే విలువలను ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది దోహద పడు తుందని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ప్రతినిధి ముసాదిక్ తంగే చెప్పారు. మతపరమైన మైనారిటీలకు మరింతగా రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని అక్కడి ప్రభుత్వాధికారులచేత గుర్తింపచేయటం ఈ చర్చల ఉద్దేశం కావాలని ఆయన సూచించారు. మతపరమైన హింసాకాండలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భారతప్రభుత్వానికి సూచించాల్సిందిగా కోరారు. సమాజంలో దుర్నీతిని పట్టిచ్చే విజిల్ బ్లోయర్‌ల రక్షణకు చట్టాలను అమలు చేయాలని కూడా కోరారు. భారతదేశం మానవుల అక్రమ రవాణా అరికట్టడంలో విఫలమైనందువల్ల ఆ దేశాన్ని సంబంధిత నివేదికలో 3వ అంచీ దేశంగా ర్యాంకు ఇవ్వాలని మానవ అక్రమరవాణా ప్రో బోనో లీగల్ సెంటర్ అధ్యక్షురాలు మార్టినా ఈ వాండన్ బర్గ్ సూచించారు. భారతదేశంలో ప్రభుత్వానికి సంబంధించిన, సంబంధిం చని వ్యక్తులు మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడుతున్నట్లు పౌరహక్కుల ప్రచారకుడు, పరిశోధనా త్మక జర్నలిస్టు అజిత్ సాహి పేర్కొన్నారు.
టెర్రర్ కేసులలో అమాయకులను పోలీసులు ఇరికించి కేసులు పెట్టటం విరివిగా జరుగుతోందని,వారిని సృష్టించ డానికి యంత్రాంగాన్ని భారత్ రూపొందించాలని సాహి సూచించారు.

Comments

comments

Related Stories: