ఉస్మానియా వైద్యుల అరుదైన ఘనత

ఉస్మానియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ బట్టతలపై వెంట్రుకలు అమర్చిన వైద్యులు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే తొలి శస్త్రచికిత్స మన తెలంగాణ/గోషామహల్: అనేక అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తొలిసారి గా నిర్వహించిన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష న్ శస్త్రచికిత్సను వైద్యులు దిగ్విజయంగా పూర్తిచేశారు. ఉస్మానియా ఆసుపత్రి డెర్మ టాలజీ విభాగాధిపతి డా. వెంకటరమణ నేతృత్వంలో శనివారం పాతబస్తీకి చెందిన […]

ఉస్మానియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స
పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ బట్టతలపై వెంట్రుకలు అమర్చిన వైద్యులు
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే తొలి శస్త్రచికిత్స
మన తెలంగాణ/గోషామహల్: అనేక అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తొలిసారి గా నిర్వహించిన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష న్ శస్త్రచికిత్సను వైద్యులు దిగ్విజయంగా పూర్తిచేశారు. ఉస్మానియా ఆసుపత్రి డెర్మ టాలజీ విభాగాధిపతి డా. వెంకటరమణ నేతృత్వంలో శనివారం పాతబస్తీకి చెందిన శ్రీకాంత్(26) అనే యువకుడికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిర్వహించా రు. ఈ చికిత్సలో డెర్మటాలజీ విభాగం వై ద్యనిపుణులు డా. వెంకటకృష్ణ, డా.పద్మ శ్రీ, డా. మధుబాబు, డా. రాజీవ్‌సింగ్, డా. సుధీర్, డా. సుభాష్‌రెడ్డితో పాటు 22 మం ది వైద్య బృందం పాల్గొన్నారు. వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి శస్త్ర చికిత్స ను పూర్తి చేశారు. ఓ బృందం బట్టతల వె నుక భాగంలోని వెంట్రుకలను సేకరించ గా, మరో బృందం బట్టతలపై వెంట్రుకలు అమర్చింది. రెండు బృందాల వైద్యులు, సి బ్బంది సుమారు 5గంటల పాటు శ్రమించి విజయం సాధించారు. ముందుగా వరంగ ల్ జిల్లాకు చెందిన యువతికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిర్వహించా లని నిర్ణయించినా, ఆ యువతి భయంతో చికిత్సకు అంగీకరించక పోవడంతో హె యిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం పేరు న మోదు చేసుకున్న రెండోరోజే పాతబస్తీకి చెందిన శ్రీకాంత్‌కు ఉస్మానియా వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అభినందనలు..
రాష్ట్రంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించిన హెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్సను డెర్మటాలజీ వైద్యులు విజయవంతంగా నిర్వహించడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జివిఎప్ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. డెర్మటాలజీ విభాగాధిపతి డా. వెంకటరమణతో పాటు శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు.

Comments

comments

Related Stories: