యువత వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలి

ఖమ్మం అర్బన్: యువత వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు సాగు చేసే విధంగా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రఘునాధపాలెం మండలంలోని కోయచెలక గ్రామంలో చెరుకూరి రామారావు సాగు చేస్తున్న కూరగాయల తోటను మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా చదువుకున్న యువకులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, మన రాష్ట్రంలో కూరగాయల కొరత అధికంగా ఉందని, 20 […]

ఖమ్మం అర్బన్: యువత వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు సాగు చేసే విధంగా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రఘునాధపాలెం మండలంలోని కోయచెలక గ్రామంలో చెరుకూరి రామారావు సాగు చేస్తున్న కూరగాయల తోటను మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా చదువుకున్న యువకులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, మన రాష్ట్రంలో కూరగాయల కొరత అధికంగా ఉందని, 20 శాతమే దిగుబడి సాధిస్తున్నామని, మిగతాదంతా ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకుంటున్నామని అన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తే కూరగాయల సాగుకు వారు ముందుకు వస్తారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల గురించి మండలానికి 30 మంది రైతులు చొప్పున బృందంగా ఏర్పడి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి చూపించి, అక్కడ అమలవుతున్న విధానాలు అవగాహన కల్పించాలన్నారు. మండలానికో అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులు ముందుకు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా రైతు చెరుకూరి రామారావు మాట్లాడుతూ తన తండ్రి రెండెకరాల్లో సాగు చేసే వాడని, తాను కండక్టర్‌గా చేస్తూ మానేసి వ్యవసాయం వైపు వచ్చానని తెలిపాడు. కూరగాయల సాగు చేస్తూ 11 ఎకరాల పొలం కొనుక్కున్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను 20 ఎకరాల్లో బోడ కాకర, కాకర, బీర, పచ్చిమిర్చి, టమాట, తదితర కూరగాయలు సాగు చేస్తున్నానని, ఈ ఏడాది కోటి రూపాయల దిగుబడే లక్షంగా పెట్టుకున్నానని మంత్రికి వివరించారు. దీంతో మంత్రి స్పందిస్తూ ఇలాంటి రైతులు గ్రామానికి ఒకరిద్దరు ఉండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడిఎ మణిమాల, డిడిహెచ్ శ్రీనివాసరావు, ఎడిఎ కొంగర వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బేగ్, మాజీ ఎంఎల్‌ఎ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎంఎల్‌సి పోట్ల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు మువ్వా విజయ్‌బాబు, మండలాధ్యక్షులు మద్దినేని వెంకట రమణ, సుధాకర్, గుత్త రవి, హరిప్రసాద్, వడ్డే ప్రసాద్, మేళ్లచెరువు రాం ప్రసాద్, జడ్‌పిటిసి వీరూ నాయక్, ఎంపిపి శాంత, మెంటెం రామారావు, తోట వెంకటేశ్వర్లు, సాదు రమేష్ రెడ్డి, నున్నా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related Stories: