ముగిసిన మల్లూరు శ్రీలక్ష్మినర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలు

*చివరిరోజు భారీగా తరలి వచ్చిన భక్తులు *వైభవంగా వసంతోత్సవం *స్వామివారి సన్నిధిలో  వివాహాలు *వైద్య శిబిరాల ఏర్పాటు మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీలక్ష్మినర్సింహాస్వామి బ్రహ్మోత్పవాలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. గత వారం రోజుల పాటుగా అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించిన భద్రాద్రి రామయ్య ఆలయ అర్చకులు శ్రీ అమరవాది కృష్ణమాచార్యుల బృందం గురు వారం నిర్వహించిన వసంతోత్సవంతో ముగిశాయని ప్రకటించారు. ఈనెల 20 నుంచి ఎదుర్కొళ్ళకార్యక్రమం, లక్ష్మినర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిల కల్యాణం, అనంతరం సదస్యం, రథోత్సవం, […]

*చివరిరోజు భారీగా
తరలి వచ్చిన భక్తులు *వైభవంగా వసంతోత్సవం
*స్వామివారి సన్నిధిలో  వివాహాలు
*వైద్య శిబిరాల ఏర్పాటు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీలక్ష్మినర్సింహాస్వామి బ్రహ్మోత్పవాలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. గత వారం రోజుల పాటుగా అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించిన భద్రాద్రి రామయ్య ఆలయ అర్చకులు శ్రీ అమరవాది కృష్ణమాచార్యుల బృందం గురు వారం నిర్వహించిన వసంతోత్సవంతో ముగిశాయని ప్రకటించారు. ఈనెల 20 నుంచి ఎదుర్కొళ్ళకార్యక్రమం, లక్ష్మినర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిల కల్యాణం, అనంతరం సదస్యం, రథోత్సవం, తెప్పోత్సవం, చక్రస్నానం, వసం తోత్సవ కార్యక్రమాలను కనుల పండగగా జరిపించారు. ఈ తంతును తిలకిం చేందుకు భక్తుల మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, చర్ల, వెంకటాపు రం, వాజేడు, మండలాలతో పాటుగా ఖమ్మం, కరింనగర్, వరంగల్, హైదరా బాద్, విజయవాడ, చతీష్‌ఘడ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్‌లనుంచి సైతం భక్తులు ప్రయివేటు వాహనాలలో తరలి వచ్చారు. దీంతో వారం రోజుల పాటు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆలయంలో ఆలయకమిటీ నిర్లక్షం కారణంగా బ్రహ్మోత్పవాలకు వచ్చిన భక్తులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులకు వాహన పార్కింగ్ నుంచి కొబ్బరి కాయలు, పూజా సామాగ్రి,తో పాటుగా స్వామి వారి దర్శనానికి టికెట్ తీసుకోవడంతో పాటుగా లడ్డూ,పులిహోరల ప్రసాదం దగ్గరినుంచి కొను గోలు చేసేందుకు భక్తులకు సుమారు రూ 400లనుంచి రూ500ల ఖర్చు వచ్చి నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణం సందర్బంగా శనివారం పార్కిం గ్‌కు డబ్బులు చెల్లించడం మినహయించినా మిగిలిన ఆరు రోజులు వసూలు చేస్తుం డడంతో భక్తులు స్వామ వారికి తక్కువగా కానుకలు చెల్లించారని విమ ర్శలు వినబడుతున్నాయి. ఇక ముందైనా దేవాదాయ శాఖ అధికారులు ఆల యానికి వచ్చే భక్తులకు ఖర్చులు తగ్గించేలా చర్యుల తీసుకోవాలని పలువురు కోరుతు న్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంగపేట, చుం చుపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆద్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆలయంలో ఎండ దెబ్బతగిలిన భక్తులకు ఓఆర్‌ఎస్‌ఎల్ పాకెట్లను అందజేశారు. అదే విధంగా జ్వర పీడితులకు సైతం వైద్యన్ని అందిం చారు. శ్రీ లక్ష్మి నర్సింహాస్వామి బ్రహ్మోత్సవాల ముగిం పులో భాగంగా గురు వారం వివాహాలు చేసుకున్నారు. ఈసందర్బంగా మ ల్లూ రు, మామిడి గూ డేనికి చెందిన రేగ శ్రీకాంత్ మొట్లగూడానికి చెందిన వట్టం మైనిక దంపతులు, చుంచుపల్లి గ్రామానికి చెందిన పూసం శ్యాం, ఖమ్మంజిల్లా బర్లగూడెం గ్రామానికి తాటి నిర్మలలు వివాహాన్ని చేసుకున్నారు. గతంలో మొ క్కుకున్న విధంగా గురువారం స్వామి వారి సన్నిధిలో వివాహాన్ని చేసుకున్నారు.

Related Stories: