వేశ్య పాత్రలో తళుక్కుమంటుందట!

సినిమా అంటేనే నటన. అయితే కొన్ని పాత్రలు పోషించేందుకు నటీనటులు దూరంగా ఉంటారు. వేశ్య, హిజ్రా వంటివి ఇందులో కొన్ని. కానీ ట్రెండ్ మారుతోంది. అందాల భామలు అనుష్క, ఛార్మీ, శ్రియా వంటి నాయికలు వేశ్య పాత్రలను పోషించి మెప్పించారు. ఇదే కోవలోకి మరో అగ్ర నటి వచ్చి చేరింది. విశ్వ నటుడు కమల్‌హాసన్ సరసన ‘విశ్వరూపం’ సినిమాలో నటించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఆండ్రియా ఇప్పుడు వేశ్య పాత్రలో తళుక్కుమనేందుకు ఓకే చెప్పేసింది. ప్రముఖ […]

సినిమా అంటేనే నటన. అయితే కొన్ని పాత్రలు పోషించేందుకు నటీనటులు దూరంగా ఉంటారు. వేశ్య, హిజ్రా వంటివి ఇందులో కొన్ని. కానీ ట్రెండ్ మారుతోంది. అందాల భామలు అనుష్క, ఛార్మీ, శ్రియా వంటి నాయికలు వేశ్య పాత్రలను పోషించి మెప్పించారు. ఇదే కోవలోకి మరో అగ్ర నటి వచ్చి చేరింది. విశ్వ నటుడు కమల్‌హాసన్ సరసన ‘విశ్వరూపం’ సినిమాలో నటించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఆండ్రియా ఇప్పుడు వేశ్య పాత్రలో తళుక్కుమనేందుకు ఓకే చెప్పేసింది. ప్రముఖ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘వడచెన్నై’ అనే చిత్రంలో వేశ్యపాత్రను పోషించేందుకు ఆండ్రియా ఓకే చెప్పేసిందట. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా ఈ పాత్రను పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా ఆమెలోని నిజమైన నటిని తెరపైకి తెస్తుందని సినిమా యూనిట్ ఘంటాపథంగా చెబుతోంది. ఈ సినిమా జూన్ 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది.

Related Stories: