పాకిస్థాన్ బాలుడికి కాలేయ మార్పిడి ‘సక్సెస్’

న్యూఢిల్లీ: భారతదేశ మానవత్వం సరిహద్దులు దాటింది. లివర్ క్యాన్సర్ బారినపడి పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న ఓ ఏడేళ్ల బాలుడు షాన్ సుల్తాన్‌కు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి వైద్యులు చేసిన కాలేయ మార్పిడి చికిత్స ఊపిరినిచ్చింది. లాహోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న బాధిత బాలుడి తండ్రి సుల్తాన్ బఖర్ దానమిచ్చిన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను భారతదేశ వైద్యులు విజయవంతం చేయడంతో సంతోషం వెల్లివిరిసింది. తమకు దక్కడని భారతదేశానికి తీసుకువచ్చిన బాలుడి […]

న్యూఢిల్లీ: భారతదేశ మానవత్వం సరిహద్దులు దాటింది. లివర్ క్యాన్సర్ బారినపడి పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న ఓ ఏడేళ్ల బాలుడు షాన్ సుల్తాన్‌కు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి వైద్యులు చేసిన కాలేయ మార్పిడి చికిత్స ఊపిరినిచ్చింది. లాహోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న బాధిత బాలుడి తండ్రి సుల్తాన్ బఖర్ దానమిచ్చిన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను భారతదేశ వైద్యులు విజయవంతం చేయడంతో సంతోషం వెల్లివిరిసింది. తమకు దక్కడని భారతదేశానికి తీసుకువచ్చిన బాలుడి తండ్రి, బంధు మిత్రుల పాలిట ఆ ఆసుపత్రి వైద్యులే దేవుళ్లయ్యారు. లివర్ క్యాన్సర్‌తో లాహోర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఏడేళ్ల బాలుడు షాన్ సుల్తాన్ పరిస్థితి విషమించింది.‘న్యూమోనియా, ఇన్‌ఫెక్షన్ బారినపడ్డ అతడిని చికిత్స కోసం అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత అతడు కోలుకున్నాడు. వ్యాధి బారిన పడ్డ కాలేయ భాగాన్ని తొలగించడానికి ముందు ట్యూమర్ సైజ్‌ను తగ్గించాలంటే కీమోథెరఫీ చేయాలని అక్కడి వైద్యులు సిఫారసు చేశారు’ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పెడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబ్బాల్ తెలిపారు.‘ ఎనిమిది రౌండ్లు కిమోథెరఫీ చేసినప్పటికీ ఆ గడ్డ కుంచించుకు పోలేదు. ఆ పరిస్థితులలో అతడికి కాలేయ మార్పిడి చేయాల్సివచ్చింది.‘క్యాన్సర్ బాలుడి ఛాతీ, డయాఫ్రమ్‌కి వ్యాపించింది. ఆ సమయంలో దానిని మొత్తం తొలగించడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఏ ఒక్క క్యాన్సర్ కణం మిగిలిఉన్నా మళ్లీ క్యాన్సర్ తలెత్తే అవకాశం ఉంది. ఆ సమయంలో కీమోథెరఫీ కూడా సవాల్‌గా మారింది’ అని అపోలో హాస్పిటల్స్ సెంటర్ ఫర్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్స్ చీఫ్ డాక్టర్ సుభాష్‌గుప్తా తెలిపారు.‘పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గిపోవడం లక్షణాలతో బాలుడు షాన్ సుల్తాన్‌కు కాలేయ క్యాన్సర్ లక్షణాలు ప్రారంభమయ్యాయి.అల్ట్రాసౌండ్ పరీక్షల్లో లివర్ కణితి ఉన్నట్టు తేలింది.బయాప్సీ ఫలితాలలో అతడికి హెపటోబ్లాస్టోమా ఉన్నట్టు చూపింది. దీంతో వైద్యులు షాన్ సుల్తాన్‌కు లివర్ క్యాన్సర్ ఉన్నట్టు కనుగొన్నారు’ అని బాలుడి తండ్రి బఖర్ తెలిపారు.బయాప్సీ సమయంలో ట్యూమర్ నుంచి రక్తస్రావం జరిగింది. చాతీలోకి అమర్చిన ట్యూబు నుంచి రక్తం ప్రవహించింది. రక్తస్రావానికి అడ్డుకట్ట వేసేందుకు కాలేయానికి రక్తం తీసుకువెళ్లే ధమనిని పూడ్చాల్సి వచ్చింది చెప్పారు. తన కుమారిడి పరిస్థితి వేగంగా విషమిస్తున్నది గమనించిన తాను బాలుడు ఇక బతకడం కష్టమని భావించానని, చికిత్స కోసం భారత్‌కు తీసుకువెళ్లేందుకు సిఫారసు చేయాలని వైద్యులను కోరానని సుల్తాన్ బఖర్ తెలిపారు. తన కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో రూ.35లక్షలు తీసుకుని భారత్ వచ్చినట్టు తెలిపారు.

Comments

comments

Related Stories: