ఆలయంలో లండన్ మేయర్ పూజలు

లండన్ : ఇటీవల లండన్ మేయర్‌గా ఎంపికైన సాధిక్‌ఖాన్ అక్కడి ప్రసిద్ధ స్వామి నారాయణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దేవుడికి పూజలు చేశారు. పూజారి చేత చేతి మణికట్టుకి కాశీదారం కట్టించుకున్నారు. దేవుడిని దర్శించుకున్న అనంతరం ఆయన అక్కడి ప్రజలతో ఇష్టాగోష్టి జరిపారు. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై సాధిక్ సోషల్ మీడియాలో స్పందించారు. స్వామి నారాయణ మందిర్ తనకు ఎంతో ఇష్టమైన దేవాలయమని ఆయన చెప్పారు. […]

లండన్ : ఇటీవల లండన్ మేయర్‌గా ఎంపికైన సాధిక్‌ఖాన్ అక్కడి ప్రసిద్ధ స్వామి నారాయణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దేవుడికి పూజలు చేశారు. పూజారి చేత చేతి మణికట్టుకి కాశీదారం కట్టించుకున్నారు. దేవుడిని దర్శించుకున్న అనంతరం ఆయన అక్కడి ప్రజలతో ఇష్టాగోష్టి జరిపారు. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై సాధిక్ సోషల్ మీడియాలో స్పందించారు. స్వామి నారాయణ మందిర్ తనకు ఎంతో ఇష్టమైన దేవాలయమని ఆయన చెప్పారు. ఈ వారాంతంలో ఈ గుడికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మేయర్‌గా ఇక్కడి భారతీయులతో తాను సత్సంబంధాలు కలిగి ఉంటానని తెలిపారు. త్వరలో లండన్‌తో భారత్ వాణిజ్య సంబంధాల అంశంపై దృష్టి సారిస్తానని సాధిక్‌ఖాన్ స్పష్టం చేశారు.

Comments

comments