సుబ్బరామిరెడ్డికి కోపమొచ్చింది…?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డికి కోపమొచ్చింది. అదీ ప్రధామ మంత్రి నరేంద్రమోడీకి రక్షణ కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ బృందం(ఎస్‌పిజి) గార్డులు ఎంపిలకు కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదంటూ మంగళవారం ఆయన సభలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన రాజ్యసభలో 188 నిబంధన ప్రకారం ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. సభ్యుల పట్ల ఎస్పిజి సభ్యులు నిర్లక్షంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నప్పుడు గార్డులు తన పట్ల […]

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డికి కోపమొచ్చింది. అదీ ప్రధామ మంత్రి నరేంద్రమోడీకి రక్షణ కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ బృందం(ఎస్‌పిజి) గార్డులు ఎంపిలకు కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదంటూ మంగళవారం ఆయన సభలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన రాజ్యసభలో 188 నిబంధన ప్రకారం ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. సభ్యుల పట్ల ఎస్పిజి సభ్యులు నిర్లక్షంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నప్పుడు గార్డులు తన పట్ల అమర్యాదగా వ్యవహరించారని చెప్పారు.
వారి విధులు వారు నిర్వహించటంలో తప్పులేదని, అయితే ఎంపిలమన్న కనీస గౌరవమైనా ఉండాలి కదా అని సుబ్బరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ప్రివిలేజ్ నోటీసును పరిశీలిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చెప్పారు. కాగా, ఈ నోటీసు పరిధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు రక్షణ కల్పిస్తున్న ఎస్‌పిజికి కూడా వర్తింపచేయాలని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యంస్వామి డిమాండ్ చేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

Related Stories: