పి.ఎఫ్.తో దాగుడుమూతలు

ఉద్యోగ జీవితం ముగిశాక విశ్రాంత జీవనానికి ఆర్థిక ఆలంబనయే ప్రావిటెంట్ ఫండ్. ఉద్యోగంలో చేరిన నెల నుండి 58 ఏళ్ల వయస్సు వచ్చేదాకా ఉద్యోగితోపాటు యజమాని సగం సగం చొప్పున కొంత సొమ్మును నెలనెలా జమచేయడమే ఈ నిధికి మూల ధార. చిన్న మొత్తాలే అయినా దీర్ఘకాలం జమచేయడం వల్ల చివరికి ఆది ఓ ఆసరాగా మారుతుంది. పింఛను సదుపాయం లేని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండే ఉద్యోగానంతరం జీవనాధారంగా నిలుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అన్ని […]

ఉద్యోగ జీవితం ముగిశాక విశ్రాంత జీవనానికి ఆర్థిక ఆలంబనయే ప్రావిటెంట్ ఫండ్. ఉద్యోగంలో చేరిన నెల నుండి 58 ఏళ్ల వయస్సు వచ్చేదాకా ఉద్యోగితోపాటు యజమాని సగం సగం చొప్పున కొంత సొమ్మును నెలనెలా జమచేయడమే ఈ నిధికి మూల ధార. చిన్న మొత్తాలే అయినా దీర్ఘకాలం జమచేయడం వల్ల చివరికి ఆది ఓ ఆసరాగా మారుతుంది. పింఛను సదుపాయం లేని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండే ఉద్యోగానంతరం జీవనాధారంగా నిలుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అన్ని ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్‌లో ఎన్ని రకాలున్నా పరిశ్రమల్లో, వ్యాపార సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఉపయోగపడే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ముఖ్యమైనది. ప్రధానంగా వీరి అవస రాలు తీర్చేందుకే ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఏర్పడింది. చిన్న ఉద్యోగులకు వయోభార సమయంలో ఆర్థిక వెసులుబాటు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా రాజ్యం గంలోని ఆదేశిక సూత్రాలలో పొందుపరచ బడింది. ఈ అవసరాన్ని తీర్చడానికే ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1952 లో ఏర్పడింది. ఇది 4-3-1952 నుండి అమలులోకి వచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర కార్యా లయం ఢిల్లీలో ప్రాంతీయ కార్యాల యాలు రాష్ట్ర రాజధానుల్లో, ఇతర నగరాలలోను ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ఆధీనంలో పని చేస్తాయి. కనీసం 20మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం తమ ఉద్యోగులకు కల్పించాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నెలకు 15000 రూపాయలవరకున్న జీతభత్యాలపై 12% చొప్పున ఉద్యోగి వేతనంలోనుంచి తీసుకుని అంతే మొత్తాన్ని యాజమాన్యం కలిపి ఫండ్ కార్యాలయానికి నెలనెలా చెల్లించాలి.

రూ.15000మించిన వేతనం ఉన్నవారికి వర్తించదు. ఇలా నెలనెలా జమైన సొమ్ముకు ఫండ్ కార్యాలయం ఏడాదికోసారి వడ్డీని లెక్కించి జమచేస్తుంది. ఈ వడ్డీ రేటు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఆర్థిక శాఖ తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ 8.8% ,1952లో 3%తో మొదలైన ఈ వడ్డీ రేటు 1989నుండి 2000 సంవత్సరందాకా 12% ఉండడం గమనించ దగ్గది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ 2001నుండి 2006వరకు 9.5% ఉండి ఇప్పుడు 8, 9 మధ్యన దోబూచులాడుతోంది ఈ వడ్డీ రేటును సంవత్సరానికి ఓ సారి సమీక్షించవలసిన ఆర్థిక శాఖ తమ ఇష్టానుసారం గా సవరిస్తున్నది. బ్యాంకుల్లో మాదిరిగా ముడు నెలలకు ఒక్కసారి కాకుండా ఏడాదికి ఒక్కసారి మదింపు చేసేపద్దతి ఉన్నందువల్ల సభ్యులు పొందే వడ్డీ తక్కువే. ఈ వడ్డీ రేటును 8.8%నుండి 2-2-16నాడు 8.7%కు తగ్గించింది. కార్మిక సంఘాలనుండి తీవ్ర వత్తిడి రావడంతో తిరిగి 25-4-2016 నాడు 8.8% మార్చింది. దాదాపు 12 కోట్ల ఉద్యోగ సభ్యులున్న ఫండ్ వడ్డీని 0.1% తగ్గిస్తే కేంద్రప్రభుత్వానికి దాదాపు ఏటా 600కోట్లు ఆదా అవుతాయి. మార్కెట్ వడిదుడుకులను లెక్కలోకి తీసుకొని ఆర్థిక శాఖ ఈ వడ్డీని ఖాయం చేస్తుంది. ఇందులో ఫండ్‌ను నిర్వహిస్తున్న కేంద్ర కార్మిక శాఖ బాధ్యత కేవలం ట్రస్టీల నిర్ణయాన్ని సిఫారసు చేయడం వరకే. వడ్డీ రేటు బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేట్లతో దరిదాపుల్లో ఉన్నంతకాలం ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అంతటా వడ్డీ రేట్ల తగ్గుదల కొనసాగు తున్నందు వల్ల 0.1%కోసం కూడా సమ్మెలు, ఆందోళన లు చేపట్టవలసి వస్తుంది.

పిఎఫ్ సొమ్ముపై కేంద్రప్రభుత్వం ఎప్పుడూ శీతకన్నే వేస్తోంది. కొంత అటుఇటు జరిపినా కోట్లాది రూపా యలు దండుకోవచ్చని పన్నాగం. 2015మార్చి బడ్జెట్‌లో పిఎఫ్ ద్వారా ఉద్యోగికి చేతికొచ్చిన సోమ్ములో కొంత మొత్తానికి ఆదాయపు పన్ను వేయాలని పత్రిపా దించింది. దీనిని యుపిఎ ప్రభుత్వం చివరి బడ్జెట్ లో రూపకల్పనం చేశారు. ఉద్యోగ, కార్మిక సంఘాల తీవ్ర ఒత్తిడి మూలంగా ఆ ప్రతిపాదన ఉపసంహ రించబ డిం ది.
అసలు ఉద్యోగ కార్మిక సంఘాలు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేది. తల్లి కోడి పిల్లలను కాపాడుకొనే మాదిరిగా ఉద్యోగుల పిఎఫ్‌ను రక్షించడం ఉద్యోగ సంఘాల బాధ్యత కాగా గద్దలా తన్నుకపోవాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానిది. తమది కార్మికుల పక్షపాత ప్రభుత్వమని కేంద్రకార్మిక, ఉపాధి కల్పనా శాఖామంత్రి బండారు దత్తాత్రేయ పలకడానికి ఆధారం ఏమిటి! తనను మించి న శ్రామికుడు లేడని ప్రధానమ్రంతి నరేంద్రమోడీ ప్రకటించుకోవడంలో నిజమెంత? మేడే ఉత్సవాల్లో బీరాలు పలుకుతూ కార్మికుల జేబులు కొట్టేయటానికి కుట్రలు రచిస్తూనే ఉంటున్నారు. వడ్డీ రేటు తగ్గింపు, చేతికొచ్చిన పిఎస్ సొమ్ముపై ఆదాయం పన్నుపోటులను తీవ్రంగా నిరసిస్తున్న, నిరోధి స్తున్న తరుణంలోనే 58 ఏళ్లు వచ్చేదాకా యాజమాన్యం చెల్లించిన సొమ్మును తాకే హక్కు లేదంటూ కేంద్రం 10.2.2016 నాడు రాజపత్రం విడుదలచేసింది. వేలాది దుస్తుల పరిశ్రమ కార్మికులు రోడ్డుపైకి వచ్చాక 19.4.2016 నాడు ఈ ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. బెంగుళూరు-తుముకూరు మార్గంలో వేలాది మంది మహిళా కార్మికులు ఏ కార్మిక సంఘం పిలుపు లేకుండా రోడ్డుపై బైఠాయించారంటే ప్రభుత్వ నిర్ణయం వారి గుండెలను ఎంత రగిల్చి ఉండాలి!

గృహనిర్మాణం, అనారోగ్యం, పిల్లల పెండ్లిళ్ల నిమిత్తం ఆ నాటి వరకు జమైన మొత్తం సొమ్మును తీసు కునే హక్కు సభ్యునికి చట్టం ఏనాటి నుంచో కల్పించ బడింది. అత్యవసరాలకు, బయటి వడ్డీ రేట్లకు భయపడి దాదాపు 80 శాతం ఫండ్ సభ్యులు అప్పటి వరకు జమైన సొమ్మును వెనక్కి తీసుకుంటారు. నిజానికి దీనివల్ల ఫండ్ లక్షం దెబ్బతింటుంది. కాని అడకత్తెరలో పోక చెక్క లాంటి బతుకులలో రేపటి ఆలోచనకు అవ కాశం లేదు. నిజానికి యాజమాన్యం నెలనెలా చెల్లించే వాటాలో అనగా 12 శాతం నుండి 8.33 శాతం పెన్షన్ ఫండ్‌కు జమకాగా 3.67 శాతం మాత్రమే సభ్యుడి పిఎఫ్ ఖాతాలో కలుస్తుంది. ఈ మాత్రం దానికి కేంద్రం అడ్డు పుల్ల వేయడం ఘోరంగా ఉంది. భగ్గునమండిన మహిళా కార్మికుల స్థితి గతులు గురించి పట్టించు కోకుండా వారి ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా పరిగణించి కేసులు, అరెస్టులు చేపట్టడం అన్యాయం. భవిష్యనిధిగా జమకావల్సిన సొమ్మును కార్మికులు ఎప్పటికప్పుడు తేనెతుట్టెలా పిండుకోవడానికి కారణం వారికి సరియైన వేతనాలు, ఆదాయాలు లేకపోవడమే రాబడిని మించిన ఖర్చులుండడమే రాజ్యాంగ బద్ధంగా కల్పించబడిన పిఎఫ్ వసతి కార్మికులను ఏ మేరకు కాపాడ గలుగుతుంది? వారి మెరుగైన జీవితం కోసం చేపట్టవలసిన మార్పులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం అలోచించాలి. రాజ్యాంగంలో ఉంది మేమిస్తున్నాం అని దులుపే సుకోకుండా ఆనాటి కాల పరిస్థితులకు రాజ్యాంగంలో పొందు పరచిన విధానాన్ని ఈనాటి పరిస్థితులకు అన్వ యించి రాజ్యాంగ స్ఫూర్తిని పాటించాలి. రాజ్యాంగంలో లేకున్నా, కార్మిక సంఘాల చట్టాలు లేకున్నా ఈ చిన్నపాటి కార్మికులకు ఎలాంటి భద్రత ఉండేది కాదు.

బ్యాంకుల్లో జమ అయ్యే దీర్ఘకాల డిపాజిట్లపై కూడా డిపాజిటరుకు అవసర నిమిత్తం పత్రాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకర్లు ముఖ విలువపై 80% అప్పు ఇస్తారు. ఇలా బ్యాంకుల్లో పొదుపైన కాలపరిమితి డిపాజిట్ల మొత్తంలో అప్పుగా తీసుకునే సొమ్ము 30% మించదు. అంటే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును కాలపరిమితి ముగిసేదాకా తీసుకోరు. అదే పిఎఫ్ విషయానికొస్తే 70 నుంచి 80 శాతం మంది విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. కారణం జీవన పరిస్థితి. అంత ఖచ్చితంగా పొదుపు చేయించినా ఉన్న సొమ్ముతో అవసరాలు తీరడం లేదు. భవిష్యనిధిని భద్రంగా ఉంచు కోలేని పరిస్థితి కార్మికులది. అన్నీ అత్యవసరాలే వారికి. ప్రావిడెంట్ ఫండ్ యాజమాన్యం సంస్థలు సొంతం గా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కొన్ని బ్యాంకు లు, ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ తమ వద్దే ఉంచుకొని వ్యాపార నిమిత్తం వాడుకుంటారు. ఫండ్ బోర్డులో ఉద్యోగ ప్రతినిధులు కూడా ఉండి అజమాయిషీలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఇది బలమైన ఆర్థిక పునాది, దీర్ఘకాల మనుగడ ఉన్న సంస్థల కే సాధ్యం. సొంతంగా ప్రావిడెంట్ ఫండ్ నిర్వహించు కుంటే సభ్యులకు లాభాలు కూడా ఎక్కువే వస్తాయి.

కేంద్రప్రభుత్వం నిర్వహణలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ లో జమచేసినట్లే ఉద్యోగి బయట బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్‌గా అదే మొత్తాన్ని కూడబెడితే ప్రభుత్వం ఇచ్చే కన్నా రెట్టింపు మొత్తం వస్తుంది. దీనికి కారణం బ్యాంకులో చేరే నాటి వడ్డీయే చివరిదాకా ఉండడం ఒకటైతే మూన్నెళ్లకోసారి వడ్డీని లెక్కకట్టి జమచేయడం మరో కారణం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చిరుద్యోగుల ఆశా దీపం. దాని నిర్వహణతో వారి బతుకులు ముడిపడి ఉన్నాయి. ఉద్యోగులో, వారి సంఘాలో రోడ్డున పడి ఆందోళన చేపట్టే పరిస్థితి కల్పించడం దారుణం. అమా నుషం కూడా. చిన్న చిన్న ఇళ్లల్లో, మాసిన బట్టలతో, సగం కడుపు కు తింటూ బతుకుతున్న శ్రామికులు ప్రభుత్వాలు తమ జీవితాన్ని ఓ మెట్టు ఎక్కిస్తాయని ఆశ పడ్తారు. నాయ కుల మాటలు కూడా దాన్నే ధ్వనిస్తుంటాయి. కాని చేత లు తద్విరుద్దం. పిఎఫ్ ఖాతాదారుల వెంటపడి వారి ని ఏమార్చి వారి చెమట సొమ్ముతో షోకులు చేయా లను కోవడం పాపంతో సమానం. కార్మికుల సంఘాల నీడ కన్నా ప్రభుత్వాల నీడలో మరింత సేవ తీర్చు కోవ చ్చనే భావన ఈ చిరుజీవుల్లో కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. లేకుంటే వాటి ఉనికికి అర్థమే లేదు.
– 9440128169

Comments

comments