మహిళా జర్నలిస్టు అనుమానస్పద మృతి

ఫరీదాబాద్ : నేషనల్ మీడియా పోర్టల్‌లో పనిచేస్తున్న ఇండోర్‌కు చెందిన పూజా తివారి అనే మహిళ జర్నలిస్టు అనుమానస్పద స్థితిలో మరణించింది. బలవంతపు వసూళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న పూజా ఫరీదాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజా తివారి జాతీయ మీడియా పోర్టల్‌లో పని చేస్తుంది. మరో జర్నలిస్టు అమ్రిన్, పోలీస్ అధికారి అమిత్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం నుంచి మద్యం సేవించిన ఆమె […]

ఫరీదాబాద్ : నేషనల్ మీడియా పోర్టల్‌లో పనిచేస్తున్న ఇండోర్‌కు చెందిన పూజా తివారి అనే మహిళ జర్నలిస్టు అనుమానస్పద స్థితిలో మరణించింది. బలవంతపు వసూళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న పూజా ఫరీదాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజా తివారి జాతీయ మీడియా పోర్టల్‌లో పని చేస్తుంది. మరో జర్నలిస్టు అమ్రిన్, పోలీస్ అధికారి అమిత్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం నుంచి మద్యం సేవించిన ఆమె రాత్రి భోజనం తర్వాత కూడా దాన్ని కొనసాగించింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ తన నివాసంలోని ఐదవ అంతస్తు నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. మద్యం మత్తులోనే ఉన్న పూజా క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు అమిత్, అమ్రిన్ తెలిపారని సూరజ్ కుంద్ ఎస్‌ఐ రాజిందర్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో పరిశోధన చేయనున్నట్లు కమిషనర్ చెప్పారు.

Comments

comments

Related Stories: