కొత్త జిహాదీ జాన్‌గా సిద్ధార్థ ధర్

లండన్: బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన సిద్ధార్థ ధర్ ఇప్పుడు భయంకర ఐసిస్ ఉగ్రవాద సీనియర్ నాయకుడని యూదు టీనేజర్ నిహద్ బర్కత్ తెలిపినట్టు ‘ది ఇండిపెండెంట్ ’ వార్తాపత్రిక తెలిపింది. ఆమె ఇన్నాళ్లు ఆ గ్రూప్ వ్యభిచార బానిసగా బందీ అయింది.  తనని సిద్ధార్థ అపహరించి, అక్రమ రవాణ చేశాడని ఆమె తెలిపింది. ప్రస్తుతం అతడు ఇరాక్‌కు పట్టున్న మోసుల్‌లో ఉన్నట్లు తెలిపింది. సిద్ధార్థ మొదట్లో బ్రిటిష్ హిందువుగా ఉండేవాడు. తర్వాత అతడు ఇస్లాంలోకి […]

లండన్: బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన సిద్ధార్థ ధర్ ఇప్పుడు భయంకర ఐసిస్ ఉగ్రవాద సీనియర్ నాయకుడని యూదు టీనేజర్ నిహద్ బర్కత్ తెలిపినట్టు ‘ది ఇండిపెండెంట్ ’ వార్తాపత్రిక తెలిపింది. ఆమె ఇన్నాళ్లు ఆ గ్రూప్ వ్యభిచార బానిసగా బందీ అయింది.  తనని సిద్ధార్థ అపహరించి, అక్రమ రవాణ చేశాడని ఆమె తెలిపింది. ప్రస్తుతం అతడు ఇరాక్‌కు పట్టున్న మోసుల్‌లో ఉన్నట్లు తెలిపింది. సిద్ధార్థ మొదట్లో బ్రిటిష్ హిందువుగా ఉండేవాడు. తర్వాత అతడు ఇస్లాంలోకి మతాం తీకరణ చెందాడు. ప్రస్తుతం అబూ రుమయ్‌సా పేరుతో చెలామణి అవుతున్నాడు. అతడిని ఐసిస్ గ్రూపు ‘కొత్త జిహాదీ జాన్’గా అభివర్ణిస్తున్నారు. తనని కిర్‌కుక్‌లో పట్టుకున్నారని, తర్వాత మోసుల్‌కు చెందిన అబు ధర్ అనే ఐసిస్ నాయకుడి వద్దకు తీసుకెళ్ళారని, అతడి వద్ద అదివరకే యజ్దీ యువతులు బందీగా ఉన్నారని, ప్రతి రోజు వారు తనని మరో వ్యక్తిని పెళ్ళాడాలని అంటుండేవారని నిహద్ తెలిపింది. ఇంగ్లాండులోని బ్రిటిష్ ముస్లిం టివి రూపొందించే డాక్యుమెంటరీ సీరిస్‌లో ఆమె తాజా ఇంటరూ డాక్యు మెంటరీగా చోటు చేసుకుంది.  అబుధర్, సిద్ధార్థ ధర్ ఒక్కరేనా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ది ఇండి పెండెంట్ వార్తా పత్రిక ప్రయత్నించింది. బర్కత్ చెప్పేది సిద్ధార్థ గురించేనని డాక్యుమెంటరీ ప్రెజంటర్ జోసఫ్ హయత్ నిశ్చయించారు. మొహమ్మద్ ఎంవాజీ స్థానంలోకి సిద్ధార్థ చేరాడని నమ్ముతున్నట్లు, అతడిప్పుడు ‘జిహాది జాన్’గా గుర్తింపు పొందినట్టు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సిద్ధార్థ ధర్ సోదరి, లండన్‌లోని లా స్టూడెంట్ అయిన కొనికా ధర్ తన అన్న ఉగ్రవాద ఘాతుకాలు చేయ డానికి ఆస్కారమే లేదని ఐసిస్ ప్రచారం విడియో చూసి చెప్పింది. బ్రిటిష్ గూఢచారులను చంపిన ఆ ముసుగు వ్యక్తి తన సోదరుడు కానేకాదంది. ఈ విషయా లను ఆమె హౌస్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ కమిటీ ముందు  తెలిపింది.

Comments

comments

Related Stories: