జలమండలిలో  బయోమెట్రిక్

సిటీబ్యూరో:జలమండలిలో పూర్తిస్ధాయిలో బయో మెట్రిక్ విధానం అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశా సానుసారం జలమండలి ఉన్నతాధికా రులు 33లక్షల రూపాయల వ్యయం తో 150 బయోమెట్రిక్ మిషన్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే మొదటి విడుతగా జలమండలి ప్రధాన కార్యా లయంతో పాటు 43 స్థానాలలో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు. అలాగే ఈ విధా నాన్ని ప్రతి డివిజన్‌లో, సబ్ డివిజన్ లో, సెక్షన్లలోను అమలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంచలంచెలుగా […]

సిటీబ్యూరో:జలమండలిలో పూర్తిస్ధాయిలో బయో మెట్రిక్ విధానం అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశా సానుసారం జలమండలి ఉన్నతాధికా రులు 33లక్షల రూపాయల వ్యయం తో 150 బయోమెట్రిక్ మిషన్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే మొదటి విడుతగా జలమండలి ప్రధాన కార్యా లయంతో పాటు 43 స్థానాలలో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు. అలాగే ఈ విధా నాన్ని ప్రతి డివిజన్‌లో, సబ్ డివిజన్ లో, సెక్షన్లలోను అమలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంచలంచెలుగా మిగతా 207 ప్రాం తాలలో బయోమెట్రిక్ మిషన్లను ఏర్పా టు చేస్తున్నారు. ప్రస్తుతం జల మండ లిలోని 17 డివిజన్లలోని 3వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం మంది కార్యాలయాల్లో, సగం మంది ఫీల్డ్‌లో పని చేస్తున్నారు. కార్యాలయ ల్లో పని చేసే ఉద్యోగులతో పాటు ఫీల్డ్ స్టాఫ్ ఉదయం సాయంత్రం తమ పరిధిలోని డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాలకు తప్పనిసరిగా వచ్చి వెళ్ళాల్సి ఉంది. అయితే ఇప్పటికి జలమండలిలోని అన్ని కార్యాలయాల్లో మ్యాన్‌వల్ పద్దతిలో సంతకాలు తీసుకుని హాజరు తీసుకుని వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది ఉద్యోగులు, ఫీల్డ్‌స్టాఫ్ ఉదయం కార్యాలయాలకు వచ్చి సంతకం చేసి బయటకు వెళ్ళి అటు నుంచి అటే ఇళ్లకు వెళ్ళిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఉదయం విధులకు హాజరై సంతకం చేసి మధ్యాహ్నం నుంచి సొంత పనులు చేసుకుంటున్నట్లు తెలిసింది. దీనివలన జలమండలిలో పనులు సకాలంలో జరగక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని నివారించడటానికి ప్రధాన కార్యాలయం నుంచి క్షేత్రస్ధాయి కార్యాలయాల వరకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పనులు సత్వరగా జరిగి వినియోగదారులకు ఉత్తమ సేవలు అందేలా చర్యులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా బయోమెట్రిక్ విధానాన్ని జలమండలిలోని ఫీల్డ్‌స్టాఫ్, కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా యి. తాము ఉదయం 7గంటలకు కార్యాలయాలకు వచ్చి సంతకం చేసి ఏరియాల్లోకి వెళ్ళి పనులు చేస్తున్నామని ఫీల్డ్‌స్టాప్ అంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాము ఎండనక,వాననక కష్టపడి పనులు చేసి అలసిపోతున్నామని, తిరిగి దూరంగా ఉన్న కార్యాలయాలకు ఎలా రావాలని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అలాగే సబ్ డివిజన్, సెక్షన్ స్ధాయిలో బయోమెట్రిక్ విధానాన్ని మానిటరింగ్ చేసే అధికారులు కూడ దీనిని నిర్లక్షం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయాల్లో బయోమెట్రిక్ మిషన్లను ్ల ఏర్పాటు చేసిన కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి ఇప్పటికి మ్యాన్‌వల్ పద్దతిలోనే హాజరు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివలన సిబ్బంది తమ విధులకు సక్రమంగా హాజరుకాక ఇటు జలమండలికి నష్ట వాలిల్లుతుందని, అటు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన జలమండలిలో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్భందిగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: