ప్రజల మనస్సును దోచుకున్న అరుదైన వ్యక్తి

ఖమ్మం ప్రతినిధి : జీవించినంత కాలం తన సేవల ద్వారా ప్రజల మనస్సు దోచుకున్న దండి భాస్కర్, మరణించినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రోడ్డు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల మరణించిన సిపిఐ నాయకుడు సీనియర్ జర్నలిస్టు దండి భాస్కర్ సంస్మరణ సభ బుధవారం జిల్లా సిపిఐ ప్రముఖులు మహ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగింది. సభలో తుమ్మల మాట్లాడుతూ ఉన్నత పదవులు అనుభవించిన వారికి అతి పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నవారికి […]

ఖమ్మం ప్రతినిధి : జీవించినంత కాలం తన సేవల ద్వారా ప్రజల మనస్సు దోచుకున్న దండి భాస్కర్, మరణించినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రోడ్డు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల మరణించిన సిపిఐ నాయకుడు సీనియర్ జర్నలిస్టు దండి భాస్కర్ సంస్మరణ సభ బుధవారం జిల్లా సిపిఐ ప్రముఖులు మహ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగింది. సభలో తుమ్మల మాట్లాడుతూ ఉన్నత పదవులు అనుభవించిన వారికి అతి పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నవారికి దక్కని అరుదైన గౌరవం దండి భాస్కర్‌కు దక్కిందన్నారు. జీవించినంత కాలం తన సేవల ద్వారా ప్రజల మనస్సు దోచుకున్నాడని, భాస్కర్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఎర్రజెండా మోస్తూనే నేలకొరిగిన భాస్కర్‌లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం ఆ పార్టీకి, ఆ సంఘాలకు ఎదురు లేదన్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండి పోయే వ్యక్తుల్లో భాస్కర్ ఒకడని తుమ్మల కొనియాడారు.
పట్టుదలే పరమావధి : పువ్వాడ
పట్టుదల పరమావధిగా తాను నమ్మిన సిద్ధాంత వ్యాప్తికి కృషి చేసి ప్రజలందరి అభిమాన పాత్రుడు దండి భాస్కర్ అని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. భాస్కర్ కుటుంబంతో యాభై సంవత్సరాల అను బంధం ఉందని, చిన్నప్పుడు బాగా దూకుడుగా ఉండే భాస్కర్ పరిణితి చెంది విభిన్న మార్గాలలో సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయడం ప్రారంభిం చాడన్నారు. ప్రస్తుతం దేశంలో మతాన్ని రాజకీయంలోకి చొప్పించే బడుగు, బలహీన వర్గాలను విస్మరిస్తూ పాలన సాగుతుందన్నారు. మత విద్వేషాలు, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. త్యాగనిరతితో పని చేయాలని, కష్టాలు, నష్టాలు తప్పవని ఐక్యంగా ముందుకు సాగుతూ బలమైన ఉద్యమ నిర్మాణమే భాస్కర్‌కు సరైన నివాళి అన్నారు.
రాజకీయం అపవిత్రమవుతుంది
రాజకీయం అనే పదం కొనుగోళ్లు, అ మ్మకాలు, ఫిరాయింపులతో అపవిత్ర మవుతుందని సిపిఐ జాతీయ కార్యద ర్శి కంకణాల నారాయణ తెలిపారు. ఈ చర్యలతో రాజకీయాల పట్ల యువ తలో నిరుత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకో వాలంటే పార్టీ కార్డును మెడలో వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ నేపథ్యంలో ఎర్రజెండా నీడలో భాస్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలన్నారు.
జనం గుర్తుంచుకునే మనిషి : తమ్మినేని
ప్రజలు గుర్తుంచుకునే మనిషి భాస్కర్ అని మరణం ముంగిట కూడా ఎర్రజెండా పురోభివృద్ధిని, గ్రామ ఐక్యతను కోరుకున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఏదులాపురం గ్రామాన్ని ఎప్ప టిలాగానే కమ్యూనిస్టు కంచుకోటగా ఐక్యంగా ఉంచండని అపూర్వ సందే శాన్ని ఇచ్చాడని ఇలాంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారన్నారు. దేశంలో సమస్యలకు అంతిమ పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని, మార్సిజానికి మించిన ఇజం మరోటి లేదన్నారు. దానిని మించిన సిద్దాంతం పుట్టలేదన్నారు. విబేధాలను సైతం భరించే ఐక్యతతో కమ్యూనిస్టులు ముందుకు సాగాలన్నారు.
వీలునామాను అమలు చేద్దాం : కూనంనేని
అందరూ మరణించే సమయంలో ఆస్తులు, నగదు ఇతరాలకు సంబంధించి వీలునామా రాస్తారని, భాస్కర్ మాత్రం కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయండని వీలునామా రాశాడని, ఆ వీలునామాను అమలు చేయడం మన కర్తవ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ భూమిపై అనేక మంది జన్మించినా ప్రజల కోసం పని చేసిన వారే చిరస్థాయిగా నిలిచి పోతారని అటువంటి వారిలో భాస్కర్ ఒకడన్నారు. ఈ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ ఎన్‌డి జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు, పోటు రంగారావు, జడ్‌పి మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, టియుడబ్లుజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రాం నారాయణ, టిడిపి జిల్లా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, సిపిఐ నాయకులు పోటు ప్రసాద్, రావులపల్లి రాం ప్రసాద్, శింగునర్సింహారావు, పుచ్చకాయల కమలాకర్, సిద్దినేని కర్ణకుమార్, రూరల్ ఎంపిపి మేళ్లచెరువు లలిత, సిపిఐ ప్రజా సంఘాలనాయకులు యడ్లపల్లి శంకర య్య, అజ్మీరా రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు కల్లెం వెంకటరెడ్డి, ఏదులాపురం సర్పంచ్ ధరావత్ సుభద్ర, ఉప సర్పంచ్ వెంపటి వెంకట సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండాలు ఐక్యం కావాలి : నారాయణ
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగు తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే ఎర్రజెండాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సిపిఐ జాతీయ నాయకులు కంకణాల నారాయణ విలేకరుల గోష్టిలో చెప్పారు. పాలేరులో సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌కు సీపీఐ మద్దతునిస్తోందని, న్యూడెమోక్రసీ సైతం మద్దతివ్వాలని సూచించారు. వామపక్షాల ఐక్యతతోనే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని చెప్పారు. ఆయనవెంట సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కార్యదర్శి వర్గ సభ్యుడు పోటు ప్రసాద్, ఖమ్మం నగర కార్యదర్శి ఎస్‌కే జానిమియా, జిల్లా సమితి సభ్యులు పుచ్చకాయల కమలాకర్ ఉన్నారు.

Related Stories: