‘ ఫోబియా ’తో ప్రేక్షకుల ముందుకు డస్కీ బ్యూటీ

బాలీవుడ్‌లో డస్కీ బ్యూటీగా పేరున్న రాధికా ఆప్టే సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఫోబియా’ చిత్రంలో కథానాయికగా సరికొత్త అవతారంలో కనబడబోతోంది. ఈ చిత్రంలో ‘మెహతక్’ అనే ఆర్టిస్టు రోల్ పోషిస్తున్న ఆమెకు ఇలాంటి పాత్ర పోషించే అవకాశం రావడం ఇదే ప్రధమం. ఓ అద్దె కారులో ప్రయాణిస్తున్న ఆర్టిస్టు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో చిక్కుకోని ఆ తరువాత ఆమెకు కలిగిన విచిత్రమైన అనుభవాలు, ఈ దశలో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే చిత్రం యొక్క ప్రత్యేకత. ‘మెహతక్’ […]

బాలీవుడ్‌లో డస్కీ బ్యూటీగా పేరున్న రాధికా ఆప్టే సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఫోబియా’ చిత్రంలో కథానాయికగా సరికొత్త అవతారంలో కనబడబోతోంది. ఈ చిత్రంలో ‘మెహతక్’ అనే ఆర్టిస్టు రోల్ పోషిస్తున్న ఆమెకు ఇలాంటి పాత్ర పోషించే అవకాశం రావడం ఇదే ప్రధమం. ఓ అద్దె కారులో ప్రయాణిస్తున్న ఆర్టిస్టు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో చిక్కుకోని ఆ తరువాత ఆమెకు కలిగిన విచిత్రమైన అనుభవాలు, ఈ దశలో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే చిత్రం యొక్క ప్రత్యేకత. ‘మెహతక్’ ఆర్టిస్టు పాత్రలో నటించిన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం చిత్ర నిర్మాణకులు విడుదల చేశారు. అయితే ఈ భీకరమైన పాత్రను పోషించే ముందు ఈ డస్కీ బ్యూటీ పలువురు సైకియాట్రిస్టులను సంప్రదించింది. దీంతోపాటు కొందరు సైకియాట్రిక్ రోగులను గమనించిందట. అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన హాలీవుడ్ చిత్రానికి రిమేక్ చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్. ఈనెల 25న ‘ఫోబియా’ చిత్రం అధికారికంగా ఓ ట్రైలర్‌ను విడుదల చేయనుంది. ఈ థ్రిల్లర్ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా పవన్ కృపలానీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Comments

comments

Related Stories: