ఉందిలే మంచికాలం…

కురుస్తుంది నైరుతి మేఘం న్యూఢిల్లీ: రెండేళ్ల వర్షాభావ పరిస్థితుల తర్వాత ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉం దంటూ కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబు రందించింది. నైరుతి రుతుపవనాలకు ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని ప్రభుత్వం అం చనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ మాసం ప్రా రంభంలో ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్  రాష్ట్రాలకు సూచించారు. […]

కురుస్తుంది నైరుతి మేఘం

న్యూఢిల్లీ: రెండేళ్ల వర్షాభావ పరిస్థితుల తర్వాత ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉం దంటూ కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబు రందించింది. నైరుతి రుతుపవనాలకు ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని ప్రభుత్వం అం చనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ మాసం ప్రా రంభంలో ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్  రాష్ట్రాలకు సూచించారు. 2016-17  ఖరీఫ్ ఉద్యమంలో భాగంగా సోమవారం జరిగిన జాతీయ సదస్సులో పట్నాయక్  ప్రసం గించారు. ‘ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా క్షీణి స్తున్నాయి. లానినా దాన్ని అధిగమించనుంది. అందువల్ల   ఈ ఏడాది రుతుపవనాలకు అనుకూలంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. త్వరలో వాతావరణ విభాగం అంచనాలు కూడా వెలువడనున్నాయని పే ర్కొన్నారు. వరుసగా   గత రెండు సంవత్సరాల నాటి వర్షాభావ పరిస్థితు లు, ఈ ఏడాది  పునరావృతం అయ్యే అవకాశం లేదని గత  ఫిబ్రవరి ఆర్థిక సర్వే తేల్చి చెప్పిందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ప్రభు త్వాలు సిద్ధంగా ఉండాలని పట్నాయక్  రాష్ట్రాలకు  సూచించారు.  ఎలాం టి అవాంఛనీయ  సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా ఆకస్మిక ప్రణా ళికలు రచించుకోవాలన్నారు.

Related Stories: