హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన-ర్యాలీ

పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టాలని  హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన-ర్యాలీ ముషీరాబాద్:పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది బిసి మహిళలు, పురుషులు తరలివచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని దేశంలోని […]

పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టాలని  హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన-ర్యాలీ
ముషీరాబాద్:పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది బిసి మహిళలు, పురుషులు తరలివచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని దేశంలోని అన్ని పార్టీల సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెండు తెలుగు ప్రభుత్వాలు అఖిల పక్షాలతో ప్రతినిధి బృందం ఏర్పరచి ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ఈ విషయంపై కలవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని తీర్మాణం చేశారని తెలిపారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రిని కలిసి చర్చలు జరపాలన్నారు. బిసిలకు విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్టును తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కేంద్రస్థాయిలో లక్ష కోట్ల బడ్జెట్‌తో బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేసి, బిసి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రదర్శనలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, బిసి విద్యార్థి సంఘం అధ్యక్షులు ర్యాగ రమేష్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బిసి నేతలు గొరిగె మల్లేష్, దుర్గయ్యగౌడ్, బిసి విద్యార్థి వర్కింగ్ ప్రసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బెల్లం మాధవి, లక్ష్మీ, రావులకోల్ నరేష్, వినయ్, పార్వతి, వేముల రామకృష్ణ, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: