మా పత్రాలు హ్యాక్ అయ్యాయి

పనామా  విదేశీ సర్వర్లు  గురయ్యామని పనామా పత్రాల కేంద్ర బిందువు అయిన మోస్సాక్ ఫోన్సెకా సంస్థ ఆరోపించింది. అనేక రకాల  ఆర్థిక లావాదేవీలను చట్టబద్ధంగా నిర్వహిస్తూ , పన్ను ఎగవేతదార్లకు అన్నీ తానై అయి ఈ సంస్థ వ్యవహరిస్తోందనే అభియోగాలు ఉన్నాయి. ఈ సంస్థ నుంచి ఇప్పుడు పనామా పత్రాలు లీక్ అయి ప్రపం చవ్యాప్తంగా సంచలనం కల్గించాయి. తమ  కంపెనీ హ్యాకింగ్‌కు గురయిందని ఈ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన రామోన్ ఫోన్సెకా తెలిపారు. ఈ హ్యాకింగ్‌తో […]

పనామా  విదేశీ సర్వర్లు  గురయ్యామని పనామా పత్రాల కేంద్ర బిందువు అయిన మోస్సాక్ ఫోన్సెకా సంస్థ ఆరోపించింది. అనేక రకాల  ఆర్థిక లావాదేవీలను చట్టబద్ధంగా నిర్వహిస్తూ , పన్ను ఎగవేతదార్లకు అన్నీ తానై అయి ఈ సంస్థ వ్యవహరిస్తోందనే అభియోగాలు ఉన్నాయి. ఈ సంస్థ నుంచి ఇప్పుడు పనామా పత్రాలు లీక్ అయి ప్రపం చవ్యాప్తంగా సంచలనం కల్గించాయి. తమ  కంపెనీ హ్యాకింగ్‌కు గురయిందని ఈ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన రామోన్ ఫోన్సెకా తెలిపారు. ఈ హ్యాకింగ్‌తో తమ ఆఫ్‌షోర్ హోల్డింగ్స్ వెల్లడి అయి, కంపెనీకి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ హాకింగ్ గురించి తాము పనామా ప్రాసిక్యూటర్స్ పరిధిలో ఫిర్యాదు చేసినట్లు ఫోన్సెకా వెల్లడించారు. హ్యాకర్ల నేరపూరిత చర్యలకు గాను తగు విధంగా శిక్షించాల్సి ఉందని తెలిపారు. అంతా ఇప్పుడు పనామా పత్రాల గురించి, అందులోని అంశాల గురించి విశ్లేషణల మీద విశ్లేషణలు చేస్తున్నారు కానీ ఎవరు కూడా అసలు ఈ పత్రాలు ఎలా వెల్లడి అయ్యాయి, హ్యాకింగ్ జరగడం తప్పు అనే అంశంపై మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తి స్థాయి నేరం అని తెలిపారు. వార్తాసంస్థల ప్రశ్నలకు ఆయన ఫోన్‌లో సమాధానం ఇచ్చారు. విదేశాలలోని సర్వర్లు హ్యాక్ చేసినట్లు సాంకేతికపరమైన అంశాలతో వెల్లడి అయిందని, దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి స్థాయి నివేదిక ఉందని చెప్పారు. అయితే ఏ దేశం నుంచి హ్యాకింగ్ జరిగిందని భావిస్తున్నారనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ప్రస్తుత అంశంపై స్పందన తనకు అర్థం కాకుండా ఉందని, గోప్యత అనేది ఉండకూడదా? గోప్యత మానవ హక్కు కాదా అని ప్రశ్నిస్తూ , ఇప్పటి తతంగం చూస్తూ ఉంటే ప్రైవసీకి అవకాశం లేదన్పిస్తోందని ఫోన్సెకా ఆవేదన వ్యక్తం చేశారు.

Related Stories: