టిఆర్‌ఎస్‌కు ఓటు.. అభివృద్ధికి చోటు : హరీశ్‌రావు

మన తెలంగాణ/ సిద్దిపేట టౌన్ : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేయకుండా ఇత రులకు వేస్తే అభివృద్ధ్ది కుంటుపడుతుందని రాష్ట్ర  నీటి పారుదల శాఖమంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అభ్యర్థుల గూర్చి ఆలోచించి వేరే వాళ్ళకు ఓట్లు వేయకుండి. పార్టీ, నన్ను చూసి కారు గుర్తుకు ఓటేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి’ అంటూ […]

మన తెలంగాణ/ సిద్దిపేట టౌన్ : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేయకుండా ఇత రులకు వేస్తే అభివృద్ధ్ది కుంటుపడుతుందని రాష్ట్ర  నీటి పారుదల శాఖమంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అభ్యర్థుల గూర్చి ఆలోచించి వేరే వాళ్ళకు ఓట్లు వేయకుండి. పార్టీ, నన్ను చూసి కారు గుర్తుకు ఓటేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి’ అంటూ పిలుపునిచ్చారు. రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారికి తమకు ఎలాంటి సంబందం లేదని, ఉండబోదని తేల్చి చెప్పారు. మీ కళ్లు ముందు పనిచేసే వాళ్ళకే ఒటు వేయాలని కోరారు. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. సిద్దిపేటను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశలో ప్రయత్నం చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రూపురేఖలు మార్చుతామని తెలిపారు. అందరూ సహకరిస్తే అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని, ఇతరులకు ఓట్లేస్తే ప్రయోజనముండదని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, త్రిసభ్యకమిటీ సభ్యులు దేవేందర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమురవెళ్ళి చందు, ఇల్లందుల అంజయ్య, గంప శ్రీనివాస్, కొమురవెళ్ళి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: