వేసవి నేస్తం పుచ్చకాయ

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎందుకంటే దాహం తీర్చడంలో దీని తర్వాతే ఏ పండైనా. దీనిలో 92 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయతో దాహం తీరడమే కాదు ఇంకా చాలా లాభాలున్నాయి. ఇది అనేక పోషకాలకు నిలయం. ఈ కాయలో విటమిన్ ఎ, బి, సి నిల్వలు అధికంగా ఉంటాయి. గులాబీ రంగులో ఉండే పుచ్చకాయ గుజ్జులో కెరాటినాయిడ్స్, బీటా కెరాటిన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. వీటినే మన శరీరం విటమిన్ ‘ఎ’గా మారుస్తుంది. పుచ్చకాయలో ఉండే […]

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎందుకంటే దాహం తీర్చడంలో దీని తర్వాతే ఏ పండైనా. దీనిలో 92 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయతో దాహం తీరడమే కాదు ఇంకా చాలా లాభాలున్నాయి. ఇది అనేక పోషకాలకు నిలయం. ఈ కాయలో విటమిన్ ఎ, బి, సి నిల్వలు అధికంగా ఉంటాయి. గులాబీ రంగులో ఉండే పుచ్చకాయ గుజ్జులో కెరాటినాయిడ్స్, బీటా కెరాటిన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. వీటినే మన శరీరం విటమిన్ ‘ఎ’గా మారుస్తుంది. పుచ్చకాయలో ఉండే ప్రకృతి సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు రక్తప్రసరణకు ఆటంకం కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తాయి. దీనిలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ ఉండవు. దీనిలో ఉండే క్యాలరీలూ తక్కువే. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచి ఆహారం. విటమిన్ సి, బీటా కెరాటిన్‌లు గుండె జబ్బుల్నీ, పెద్దపేగు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. 100గ్రాముల పుచ్చకాయ గుజ్జు నుంచి శరీరానికి కావాల్సిన విటమిన్ ‘సి’లో 21శాతం లభిస్తుంది. దీనిలో పీచుపదార్థమూ ఎక్కువే. పుచ్చకాయలో పుష్కలంగా లభించే పొటాషియం రక్తపోటు బాధితులకు చాలా మంచిది.

Comments

comments

Related Stories: