మూడు కుటుంబాల్లో పెను విషాదం

మూడు కుటుంబాల్లో  పెను విషాదం  ఐదుగురి మృతి కొడంగల్: లారీ కారును ఢీకొన్న దుర్గటనలో ఐదుగురు మృతి చెందడం, మూడు కుటుంబాల్లో విషాదం నిపింది. మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కర్ణాకటలోని యానగొంది మాత మాణికేశ్వరీని దర్శించుకోవడానికి సమీప సందువులు రెండు కుటుంబాలకు చెందిన 8 మంది ఇండికా కారులో బయలుదేరారు. కర్ణాటకలోని చించోళి నుండి వారు బయలు దేరి ఉదయం 10గంటల ప్రాం తం లో కొడంగల్ మీదుగా వెళ్తుండగా కొడంగల్‌కు 5 […]

మూడు కుటుంబాల్లో  పెను విషాదం  ఐదుగురి మృతి

కొడంగల్: లారీ కారును ఢీకొన్న దుర్గటనలో ఐదుగురు మృతి చెందడం, మూడు కుటుంబాల్లో విషాదం నిపింది. మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కర్ణాకటలోని యానగొంది మాత మాణికేశ్వరీని దర్శించుకోవడానికి సమీప సందువులు రెండు కుటుంబాలకు చెందిన 8 మంది ఇండికా కారులో బయలుదేరారు.
కర్ణాటకలోని చించోళి నుండి వారు బయలు దేరి ఉదయం 10గంటల ప్రాం తం లో కొడంగల్ మీదుగా వెళ్తుండగా కొడంగల్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని చిట్లప ల్లి స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్క పొలాల్లో పడిపోయింది. ఈ ప్రమా దంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగు రు సమీప బందువులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు ఐదు సంవత్సరాల లోపు బాలికలు ఉన్నారు. కారు కూ డా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ సమాచారం పట్టణంలో దావనంలా వ్యాపించ డంతో ప్రజలు ప్రమాద స్థలానికి తరలివెళ్లారు.
అక్కడ పరిస్థితిని గమనించి విషాదంలో మునిగారు. 108 వాహనంలో క్షతగా త్రులను కొడంగల్ ఆసుపత్రికి తరలించి వైద్య అందించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉన్న ముగ్గురికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక లోని చించోళికి చెందిన అన్నారావు, ఇద్దరు కుమార్తెలు వారి కుటుంబ సభ్యులతో యానగొందికి వెళ్తుం డగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఇద్దరు కుటుంబాలతోపాటు వారి తండ్రి కుటుంబం కలిపి ఈ సంఘటన మొత్తం మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం తెలు సుకున్న వారి కుటుంబ సభ్యులు కొడంగల్ చేరుకుని వి లపించారు.పండుగ రోజు ప్రయాణం వద్దని చెప్పినా వినకుండా కుమార్తెలిద్దరు వెళ్లారని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు బోరున వి లపించారు.

Related Stories: