అంతు పట్టని ఓటరు నాడి

పలు డివిజన్లలో ఢీ అంటే ఢీ అధికార పార్టీకి ధీటుగా నిలిచిన విపక్షాలు గెలుపుపై ఎవరి ధీమాలో వారు… ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు.  పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఓటిం గ్ సరళి బయటపడుతుంది. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం డివిజన్‌కు ఓ విధంగా ఓటర్లు స్పందించారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకు ఓటరు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. సహజంగా అధికార పార్టీకి సానుకూలత ఈ ధపా అంతగా కన్పించలేదని […]

పలు డివిజన్లలో ఢీ అంటే ఢీ
అధికార పార్టీకి ధీటుగా నిలిచిన విపక్షాలు
గెలుపుపై ఎవరి ధీమాలో వారు…

ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు.  పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఓటిం గ్ సరళి బయటపడుతుంది. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం డివిజన్‌కు ఓ విధంగా ఓటర్లు స్పందించారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకు ఓటరు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. సహజంగా అధికార పార్టీకి సానుకూలత ఈ ధపా అంతగా కన్పించలేదని పరిశీలకులు అంచనా. కొన్ని డివిజన్లలో టిఆర్‌ఎస్ పట్ల సానుకూలతన వ్యక్తం కాగా విపక్షాలు సైతం హోరా హోరీగా అధికార పార్టీతో తలపడ్డాయి. టిఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రూరల్ ప్రాంతంలో అనూహ్యంగా 80 నుంచి 90 శాతం ఓటింగ్ నమోదు అయింది. రూరల్ ప్రాంతంలో ఐదు డివిజన్లు ఉండగా ఇక్కడ విపక్షాలకే మెజార్టీ స్థానాలు దక్కుతాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా అభ్యర్థుల ప్రభావితం చేశారు. పక్క, పక్క వార్డులోనే భిన్న రాజకీయాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఉండే సంప్రదాయ ఓటింగ్‌ను ఆ పార్టీలు కాపాడుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. కొన్ని చోట్ల మైనార్టీలు అధికార పార్టీకి సానుకూలంగా ఓటు వేసినా పూర్తిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, వైసిపిలు పోటీ పడగా దాదాపు ప్రధాన పార్టీలన్నీ కార్పొరేషన్‌లో అడుగిడిగే పరిస్థితి ఏర్పడింది. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం రానున్నదని తెలుస్తుంది. కొన్ని డివిజన్లలో పోలింగ్ సరళి ఏకపక్షం కాగా, మరి కొన్ని డివిజన్లలో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. రెండు డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ధీటుగా నిలబడగా ఓ స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డబ్బు పంపిణీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. అయితే అన్ని పార్టీలు డబ్బు పంపిణీ చేయడం పార్టీలక తీతంగా ప్రతి ఓటరుకు అందించడం కూడా ఫలితాలపై సందిగ్ధ్దతకు కారణమైంది. 50 డివిజన్లకు గాను కేవలం 15 నుంచి 20 డివిజన్లకు సంబంధించి మాత్రమే ఫలితాలపై ఒక అంచనాకు రాగలుగుతున్నారంటే ఎన్నికల పోటీ ఏ విధంగా జరిగిందో ఆలోచించవచ్చు. ఓటర్ల తీర్పు ఈ విఎంలో నిక్షిప్తమైంది. ఈ నెల 9వ తేదీన అభ్యర్థుల భవిత్యవం తేలనుంది.

Comments

comments

Related Stories: