గోవధకు పాల్పడితే మరణశిక్షే : తొగాడియా

మధుర : గోవధకు పాల్పడితే మరణశిక్ష విధింపు, అయోధ్యలో రామాలయ నిర్మాణం చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ కార్యనిర్హాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగా డియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామాలయం సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నదన్నారు.  అ యోధ్యలో రామాలయాన్ని నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేసు కోవాల్సిన అవసరాన్ని తొగాడియా నొక్కిచెప్పారు. బృందావన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం ఆయన […]

మధుర : గోవధకు పాల్పడితే మరణశిక్ష విధింపు, అయోధ్యలో రామాలయ నిర్మాణం చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ కార్యనిర్హాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగా డియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామాలయం సమస్య ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నదన్నారు.  అ యోధ్యలో రామాలయాన్ని నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేసు కోవాల్సిన అవసరాన్ని తొగాడియా నొక్కిచెప్పారు. బృందావన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం ఆయన మాట్లాడారు. గోవధకు పాల్పడినట్టయితే మరణశిక్ష విధించే చట్టాన్ని రూపొందించా లన్నారు. ముస్లిం మతస్తులు గోవధకు పాల్పడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గోవధకు పాల్పడినవా రి పేర్లను ఆయా ప్రాంతాల ప్రజలు తప్పక వెల్లడించాలని, అలా చేసినట్టయితే సామాన్య  ప్రజలకు వేధింపుల బా ధ తప్పుతుందని విహెచ్‌పి నేత సూచించారు. కశ్మీర్‌లో జాతి వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీ సుకోలేదు.  అలాంటి శక్తులపై  కఠినచర్య తీసుకోని పక్షంలో దేశం లోని ఇతర ప్రాంతాలలో కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతోందన్నారు. పార్లమెంట్‌లో దాడిచేసిన అఫ్జల్‌గురు జాతి వ్యతిరేకి, యుక్తిపరుడని ఆయనకు మద్దతు ఇచ్చినా వారిని కూడా ఉరి తీయాల్సిందేనని తొగాడియా డిమాండ్ చేశారు.

Related Stories: