అమ్మల దర్శనం అద్భుతం

ఆహా…! అద్భుతం…! ఆనందంగా ఉంది, అమ్మల దర్శనం. ఇంతటి మహా భాగ్యాన్ని పొందినందుకు మాజన్మ ధన్యమైందని భక్తులు సంతోషంతో మురిసి పోయారు. శుక్రవారం కన్నెపల్లి, చిలకలగుట్టల నుంచి వచ్చిన అమ్మవార్లు తమ వద్దకు వచ్చిన భక్త కోటికి తమ అభయ హస్తాలను అందించి దీవించారు. దీంతో గద్దెల వద్దకు వెళ్లిన భక్తులు భక్తి పార వశ్యంతో జయజయ ధ్వానాలు చేస్తూ శివసత్తుల పూనకాల నడుమ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటుంటే గద్దెల ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో ఓలలాడింది. తల్లులు […]

ఆహా…!
అద్భుతం…! ఆనందంగా ఉంది, అమ్మల దర్శనం. ఇంతటి మహా భాగ్యాన్ని పొందినందుకు మాజన్మ ధన్యమైందని భక్తులు సంతోషంతో మురిసి పోయారు. శుక్రవారం కన్నెపల్లి, చిలకలగుట్టల నుంచి వచ్చిన అమ్మవార్లు తమ వద్దకు వచ్చిన భక్త కోటికి తమ అభయ హస్తాలను అందించి దీవించారు. దీంతో గద్దెల వద్దకు వెళ్లిన భక్తులు భక్తి పార వశ్యంతో జయజయ ధ్వానాలు చేస్తూ శివసత్తుల పూనకాల నడుమ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటుంటే గద్దెల ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో ఓలలాడింది. తల్లులు గద్దెలపై కొలువుదీరిన సమయం నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. గురువారం అర్థరాత్రి నుంచి మేడారానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు కిక్కిరిసాయి. నిండు పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు వెన్నెల వెలుగులో అమ్మలను చూసి మైమరిచిపోయారు.

అమ్మలను దర్శించుకుని మొక్కులు
చెల్లించుకున్న లక్షలాది మంది భక్తులు
భక్తి పారవశ్యంతో ఓలలాడిన గద్దెల ప్రాంగణం
భక్తులకు అభయ హస్తాలను అందించిన అమ్మలు
మురిసిపోయిన భక్తజనం

మేడారం:ఆహ…!అద్బుతం…!ఆనందంగా ఉంది అమ్మల దర్శనం ఇంతటి  మహా భాగ్యాన్ని పొందినందుకు నాజన్మ దన్యమైందని భక్తులు సంతోషంతో మురిసి పోయారు. శుక్రవారం కన్నెపల్లి, చిలకలగుట్టల నుంచి వచ్చిన అమ్మవార్లు తమ వద్దకు వచ్చిన భక్త కోటికి తమ అభయ హస్తాలను అందించి దీవించారు. దీంతో గద్దెల వద్దకు వెళ్ళిన భక్తులు భక్తి పార వశ్యంతో జయజయ ద్వానాలు చేస్తూ శివసత్తుల పూనకాలునడుమ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటుంటే గద్దెల ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో ఓలలాడింది. తల్లులు గద్దెలపై కొలువుదీరిన సమయం నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. గురువారం అర్దరాత్రి నుంచి మేడారానికి వివిధ ప్రాంతాలనుంచి వస్తున్న బస్సులు కిక్కిరిసాయి. నిండు పున్నమి వెన్నెల్లో సమ్మక్కసారలమ్మలను దర్శించుకున్న భక్తులు వెన్నెల వెలుగులో అమ్మలను చూసి  మైమరిచి పోయారు. మళ్ళీ జాతర వరకు మమ్ములందరిని చల్లంగ చూడమ్మ అంటు అమ్మల గద్దెలకు తల వాల్చి మొక్కుకున్నారు. పెళ్ళికాని పిల్లలకు పెళ్ళి చేయమని, పిల్లలు లేనివారికి పిల్లల భాగ్యం కల్పించమని వేడుకున్నారు.  కోరుకున్నవి జరిగితే మళ్ళి వచ్చే జాతరకు  మొక్కులు చెల్లించు కుంటా మని అమ్మల దీనలకోసం రెండు చేతులతో దండాలు పెట్టారు.ఒడి బియ్యం, బెల్లం (బంగారం),చీర,జాకెట్, గాజులు అమ్మలకు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీతో మేడారం, జంపన్న వాగు, చిలకలగుట్ట దారులన్ని కిక్కిరిసి పోయాయి. అమ్మవార్లకు మొక్కు కున్న మొక్కులను నెత్తిన పెట్టుకుని జయ హోసమ్మక్క,సమ్మక్క, సారలమ్మల   తల్లికి దండాలు అంటు నినాదాలు చేస్తు అమ్మలకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం మేడారంలో విడిదిచేసి అమ్మలకు మొక్కిన మేకలు, కోళ్ళను వండుకుని తిరిగి ఇంటికి పయనమయ్యారు.భక్తులు ఇచ్చిన మొక్కులతో సమ్మక్క  సారలమ్మ గద్దెలు నిండి పోయాయి.

Related Stories: