పిచ్చికుక్కల స్వైర విహారం బాలుడికి తీవ్రగాయాలు

అదిలాబాద్ : పిచ్చికుక్కల స్వైరవిహారం ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం ఆదిల్‌పేట్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న యశ్వానంద్‌పై నాలుగు పిచ్చికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి కుడి చెవి, పెదవులను కుక్కలు పూర్తిగా కొరికేశాయి. స్పందించిన స్థానికులు హుటాహుటిన బాలుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Comments comments

అదిలాబాద్ : పిచ్చికుక్కల స్వైరవిహారం ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం ఆదిల్‌పేట్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న యశ్వానంద్‌పై నాలుగు పిచ్చికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి కుడి చెవి, పెదవులను కుక్కలు పూర్తిగా కొరికేశాయి. స్పందించిన స్థానికులు హుటాహుటిన బాలుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments

comments

Related Stories: