నిలకడకే ఓటు

ఆసియా, టీ-20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక ఫార్మాట్ ఏదైనా, పిచ్ ఎక్కడైనా పరుగుల వరద పారించే రహానేవైపే మొగ్గుచూపారు. ఆసియాకప్‌తో పాటు సొంతగడ్డపై జరిగే టీ-20 ప్రపంచకప్ తుది జట్టు ఎంపికలో రహానే, మనీశ్‌పాండే మధ్య గట్టిపోటీ నెలకొన్నా.. నిలకడకు మారుపేరైన రహానేకే ఓటు వేశారు సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ. ఇక గాయంతో ఏడాదిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని బెంగాల్ స్పీడ్‌స్టార్ మహమ్మద్ షమికి కూడా అవకాశమిచ్చిన ఎంపిక కమిటీ శ్రీలంకతో […]

ఆసియా, టీ-20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక

ఫార్మాట్ ఏదైనా, పిచ్ ఎక్కడైనా పరుగుల వరద పారించే రహానేవైపే మొగ్గుచూపారు. ఆసియాకప్‌తో పాటు సొంతగడ్డపై జరిగే టీ-20 ప్రపంచకప్ తుది జట్టు ఎంపికలో రహానే, మనీశ్‌పాండే మధ్య గట్టిపోటీ నెలకొన్నా.. నిలకడకు మారుపేరైన రహానేకే ఓటు వేశారు సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ. ఇక గాయంతో ఏడాదిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని బెంగాల్ స్పీడ్‌స్టార్ మహమ్మద్ షమికి కూడా అవకాశమిచ్చిన ఎంపిక కమిటీ శ్రీలంకతో జరిగే మూడు టీ-20ల సిరీస్‌లో పాల్గొనే జట్టునే దాదాపు ఎంపిక చేసింది.

న్యూఢిల్లీ: గతేడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచక ప్‌లో టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన స్టార్ పేసర్ మమహ్మద్ షమి త్వరలో జరగబోయే ఆసియా, టీ-20 ప్రపంచకప్‌లకు ఎంపికయ్యాడు. ఏడాదిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని షమి గత నెల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా గాయం మళ్లీ తిరగబడడంతో స్వదేశానికి తిరిగొ చ్చాడు. అయితే ఆసియాకప్ ప్రారంభానికల్లా షమి కోలుకోగలడనే నమ్మకంతో ఎంపిక కమిటీ అతనికి చోటు కల్పించింది. “షమి దేశంలో అత్యుత్తమ పేస్ బౌలర్. గాయం నుంచి కోలుకున్న షమి ప్రస్తుతం నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. టీ-20 ప్రపంచకప్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఆసియాకప్‌లో అతను ఎలా బౌలింగ్ చేస్తాడో పరిశీలిస్తామని” ఎంపిక కమిటీ అధ్యక్షుడు సందీప్ పాటిల్ పేర్కొన్నాడు. ఇక శ్రీలంకతో జరిగే మూడు టీ-20ల సిరీస్‌కు ఎంపికైన పవన్ నేగి తన స్థానాన్ని నిలుపుకున్నాడు. గత రెండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్(ప్రస్తుతం రద్దయింది) తరుపున సత్తాచాటిన పవన్ నేగి ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్‌రౌండర్‌గా రాణించడంతోనే ఎంపిక చేశామని పాటిల్ వెల్లడించాడు. “ధోనీ మద్దతుతో నేగిని ఎంపిక చేయలేదు. బౌలిం గ్‌తో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే సత్తా నేగిలో ఉన్నందునే ఎంపిక చేశామని” అన్నాడు. జట్టు ఎంపిక సమయంలో రహానె, మనీశ్‌పాండే ఎంపికపై తీవ్రచర్చ జరిగిందని చెప్పిన పాటిల్ అను భవం దృష్టా రహానేకే ఓటు వేయాల్సి వచ్చిందన్నాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మరికొంత మంది పేర్లూ చర్చకు వచ్చినా ఎంపిక కమిటీ సభ్యులు, కెప్టెన్ ప్రస్తుత జట్టు అత్యుత్తమంగా కనిపిస్తోందని భావించారని తెలిపాడు.
ఎంపికైన జట్టు : ధోనీ(కెప్టెన్, కీపర్), రోహిత్, ధావన్, విరాట్, రైనా, యువరాజ్, రహానే, జడేజా, హార్దిక్, అశ్విన్, హర్భజన్, బుమ్రా, నెహ్రా, నేగి, షమి.
ఆసీస్‌గడ్డపై సిరీస్ గెలిచిన జట్టుతోనే..
మహిళల టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును కూడా సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. సంచలన విజయాలతో ఆస్ట్రేలియాపై తొలిసారి టీ-20 ద్వైపాక్షిక సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత జట్టునే టీ-20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది. ఈ జట్టుకు హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మిథాలీరాజ్ నాయకత్వం వహించనుంది.
మహిళా జట్టు : మిథాలీరాజ్(కెప్టెన్), జులన్‌గోస్వామి, స్మ్రితి మందన, వేద కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖాపాండే, రాజేశ్వరిగైక్వాడ్, సుష్మవర్మ, పూనమ్‌యాదవ్, వనిత, అనూజ పాటిల్, ఎక్తాబిస్త్, తిరుష్‌కామిని, దీప్తిశర్మ, నిరంజన.

Related Stories: