ప్రజలకు అండగా

నిరంతరం అందుబాటులో ఉండాలి – జెడ్‌పి చైర్‌పర్సన్లకు కెటిఆర్ హితవు మన తెలంగాణ/హైదరాబాద్: గెలిచామని పొంగిపోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నంకావాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కొత్తగా గెలిచిన జిల్లాపరిషత్ చై ర్మన్‌లకు హితవు పలికారు. ప్రజలకు అం దుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కా ర్యక్రమాలు ప్రజలందరికీ అందేవిధంగా స్థానిక సంస్థలు నిరంతరం కృషి చే యాలని ఆయన చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కెటిఆర్‌ను కలిసిన జెడ్‌పి చైర్మన్లకు […] The post ప్రజలకు అండగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిరంతరం అందుబాటులో ఉండాలి – జెడ్‌పి చైర్‌పర్సన్లకు కెటిఆర్ హితవు

మన తెలంగాణ/హైదరాబాద్: గెలిచామని పొంగిపోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నంకావాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కొత్తగా గెలిచిన జిల్లాపరిషత్ చై ర్మన్‌లకు హితవు పలికారు. ప్రజలకు అం దుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కా ర్యక్రమాలు ప్రజలందరికీ అందేవిధంగా స్థానిక సంస్థలు నిరంతరం కృషి చే యాలని ఆయన చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కెటిఆర్‌ను కలిసిన జెడ్‌పి చైర్మన్లకు చెప్పారు. సోమవారం నందినగర్ లోని కెటిఆర్ తన నివాసంలో నూతనంగా ఎంపికైన జిల్లాపరిషత్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్లతో కెటిఆర్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఇభివృద్ధికోసం, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషిలో జెడ్‌పి చైర్మన్లు భాస్వాములై సత్వరంగా బంగారు తెలంగాణ సాధనదిశలో ప్రయాణించాలని చెప్పారు. కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేసేవిధంగా జిల్లాపరిషత్ చైర్మన్లు పనిచేయాలని కెటిఆర్ పిలునిచ్చారు. చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన టిఆర్‌ఎస్ నాయకులకు, జిల్లాల ఇన్‌చార్జీలను, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పార్టీశ్రేణులను కెటిఆర్ అభినందించారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటూ ప్రజాసేవకు అధికప్రాధాన్యత ఇవ్వాలని కెటిఆర్ చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రజలతో ప్రత్యేక్ష సంబంధాలు, క్షేత్రస్థాయిలో సంపూర్ణ అవగాహన ఉంటుందని చెప్పారు. స్థానికంగా పరిష్కరం అయ్యే సమస్యలను జాప్యంలేకుండా తక్షణం పరిష్కరిస్తూ ప్రజల్లో ఉండాలని అన్నారు. అలాగే జిల్లాస్థాయి సమస్యలు జిల్లాల్లోనే పరిష్కరిస్తూ రాష్ట్ర స్థాయి లో పరిష్కారం కావల్సిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
కొత్త పంచాయతీ చట్టం పటిష్టంగా అమలు చేయాలి
స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన పంచాయితీ రాజ్ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఈచట్టం పటిష్టంగా అమలు జరిగితే స్థానికంగా సమస్యలు పరిష్కారం కావడంకో పాటు పంచాయితీలు బలోపేతం అవుతాయని చెప్పారు. నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. ప్రజల సంక్షేమంకోసం ప్రభుత్వం నిరంతరం చేస్తున్న శ్రమ, బంగారు తెలంగాణ సాధనకోసం పడుతున్న తపనలో స్థానిక సంస్థల ప్రతినిధులు నిరంతరం భాగస్వాములు కావాలని చెప్పారు.

పేరుపేరునా పలకరింపు
తనను కలిసేందుకు వచ్చిన జిల్లాపరిషత్ చైర్మన్లతో పాటు వచ్చిన స్థానిక నాయకులను కెటిఆర్ పేరుపేరునాపలకరించారు. స్థానికంగా ఉన్నపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరితో మాట్లాడుతూ జెడ్‌పి చైర్మన్లతో సరదాగా కొద్దిసేపు గడిపారు. గ్రూపుపోటో లు దిగారు. మర్యాదపూర్వకంగా కెటిఆర్ నుకలిసిన జిల్లా పరిషత్ చైర్మన్లలో నాగర్‌కర్నూల్ పి. పద్మావతి, వనపర్తి జెడ్‌పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కుమురంబీమ్ జెడ్ చైర్మన్ కోవలక్ష్మి, మెదక్ జెడ్‌పి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, నల్గొండ జెడ్‌పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సంగారెడ్డి జెడ్‌పి చైర్మన్ మంజుశ్రీ, వరంగల్ అర్బ న్ జెడ్‌పి చైర్మన్ సుధీర్ కుమార్,వరంగల్ రూరల్ జెడ్ పి చైర్మన్ గండ్ర జ్యోతి, జనగామ జెడ్‌పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,ములుగు జెడ్‌పి చైర్మన్ కుసుమ జగదీష్, మహబూబాబాద్ జెడ్‌పి చైర్మన్ అంగోతు బిందు, జయశంకర్ భూపాలపల్లి జెడ్‌పి చైర్మన్ జక్కు శ్రీహరరర్షిణి, పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్ట మధు, ఖమ్మం జెడ్‌పి చైర్మ న్ లింగాల కమల్ రాజ్ ఉన్నారు. అలాగే సంబంధిత జిల్లాల శాసనసభ్యులు, ముఖ్యనాయకులు, జిల్లాపరిష త్ చైర్మన్ల కుటుంబసభ్యులు కెటిఆర్‌ను కలుసుకుని పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.

Newly elected ZP chair presons meets KTR

The post ప్రజలకు అండగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: