మెట్రో@ ఎల్‌బినగర్

New train starts from Ameerpet to LB Nagar

ప్రజా రవాణాపై మెట్రోరైల్ ప్రభావితం
అంచనా వ్యయం రూ.14,132 కోట్లు
మూడు కారిడార్ల మీదుగా రాకపోకలు
24న అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌కు కొత్త రైలు ప్రారంభం
తీరనున్న ప్రయాణికుల వెతలు

తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం….ట్రాఫిక్ సమస్యల రహితం… సౌలభ్యంగా గమ్యస్థానాలకు చేరడం… వంటి రవాణా సదుపాయాలను అందిస్తున్నది హైదరాబాద్ మెట్రోరైలు. ఇక ముందు కేవలం 45 ని.లల్లోనే మియాపూర్ నుంచి ఎల్‌బినగర్‌కు చేరుకోవచ్చును.  రేపు (24న సోమవారం) మరో మార్గం అమీర్‌పేట్ నుండి ఎల్‌బినగర్‌కు  ప్రయాణికులను తీసుకెళ్ళేందుకు అందుబాటులోకి మెట్రో వస్తున్నది. ఈపాటికే మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రోరైలు సేవలుఅందుబాటలో ఉన్నాయి. గ్రేటర్‌లోనే నిత్యం అత్యంత రద్దీగా ఉండే మియాపూర్ ఎల్‌బీ నగర్ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఇక హాయిగా మెట్రోలో ప్రయాణాలను సాగించవచ్చును. ఈపాటికే నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు మొత్తం 25 స్టేషన్‌లలో రైలు సౌకర్యం అందుబాటులో ఉన్నది. కాగా సోమవారం నుండి మరో 16 స్టేషన్‌లు అమీర్‌పేట్ నుంచి అంటే మియాపూర్ నుండి ఎల్‌బినగర్ వరకు మొత్తం 27 స్టేషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రూ.14,132 కోట్లతో మెట్రోరైల్ ప్రాజెక్టును కొనసాగించడానికి రూపకల్పన చేశారు. అయితే వ్యవస్థ పోడువు 72 కి.మీ.ల గా ప్రతిపాధించారు. ఈ ప్రాజెక్టులో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, నాగోల్ నుంచి రాయదుర్గ, జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మూడు కారిడార్లుగా ఏర్పాటు చేశారు.
82 ప్రాంతాలకు మెట్రో
గతేడాది నవంబరులో మెదటి దశగా మెట్రోను పట్టాల మీదకు ఎక్కించి 66 స్టేషన్ల మీదుగా ఏడాది పాటు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులకు రవాణా సేవలను అందిస్తున్నది. ఇప్పుడు మరో 16 స్టేషన్‌లు మొత్తం 82 స్టేషన్‌లలో మెట్రో అందుబాటులో వస్తున్నది. ప్రతి 5 నిముషాలకు ఒక్క రైలు చొప్పున నడుపుతున్న ఈ రైలులో ఒక్కో ట్రిప్పుకు 960 మంది ప్రయాణికులు ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ఎల్.బినగర్ నుంచి మియాపూర్ రూట్‌లో 29 కి.మీ.ల దూరాన్ని 27 స్టేషన్ల మీదుగా 45 నిముషాలు సమయం, జెబీఎస్ నుంచి ఫలక్‌నుమా 15 కి.మీ.ల దూరం, 16 స్టేషన్ల మీదుగా 22 నిముషాలు సమయం, నాగోల్ నుంచి రాయదుర్గ 28 కి.మీ.ల దూరంతో 23 స్టేషన్ల మీదుగా ప్రయాణాన్ని 30 నిముషాల వ్యవధిలో నిర్ధేశిత సమయంలో చేరవేస్తుంది. అయితే ప్రస్తుతం నగరంలో వాహనాల రద్ధీతో నెలకొంటున్న ట్రాఫిక్, వెలువడుతున్న వాహన కాలుష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రోరైల్ రవాణా వల్ల కాలుష్య నివారణతో పాటు ఏసీ ప్రయాణంలో నిర్ణీత సమయంలో తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమయం ఆదాతో పాటు కాలుష్యం నుంచి కూడా ఉపశమనం పొందనున్నారు. అయితే నగరంలో పెరుగుతున్న జనాభాతో విపరీతమైన ట్రాఫిక్ రద్ధీతో కలిగే సమస్యలను అదిగమించేందుకు మెట్రోరైల్ సేవలు దోహదపడనున్నాయి.
ఈ స్టేషన్‌లు సోమవారం(రేపు) అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎంజీ బస్‌స్టేషన్, మలక్‌పేట, న్యూమార్కెట్, ముసరంబాగ్, దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి, విక్టోరియామెమోరియల్, ఎల్‌బీనగర్ వరకు కొత్త స్షేషన్ల మీదుగా మెట్రో పరుగులకు రంగం సిద్ధమైంది. అయితే ఇంతకు మందు మియాపూర్, జేఎన్‌టీయూకాలేజీ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట, భరత్‌నగర్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఎస్‌ఆర్‌నగర్ మీదుగా అమీర్‌పేట వరకు మెట్రోరైలు సేవలు కొనసాగుతున్నాయి.