దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం: కెసిఆర్

  నిర్మల్: రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నిర్మల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కశ్మీర్ లాంటిదని ప్రశంసించారు. తుమ్మడి హట్టి నుంచి రెండు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్ కళకళలాడుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా నిర్మల్‌లోని ముథోల్‌లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. జూన్ తరువాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త […] The post దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిర్మల్: రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నిర్మల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కశ్మీర్ లాంటిదని ప్రశంసించారు. తుమ్మడి హట్టి నుంచి రెండు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్ కళకళలాడుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా నిర్మల్‌లోని ముథోల్‌లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. జూన్ తరువాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని, భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. పాస్‌బుక్‌లో 36 కాలమ్స్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, పహణి, నకల్‌ను మార్చేశామన్నారు.  టిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే నిర్మల్ జిల్లా ఏర్పడిందన్నారు.

చనిపోయిన రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పిఎఫ్ కార్డు ఉన్న బిడి కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని, 18 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బిడి కార్మికులకు పెన్షన్లు ఇవ్వడంలేదని, ఒక్క తెలంగాణలో మాత్రమే బిడి కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని కెసిఆర్ చెప్పారు. రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి అందిస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలు లేవని, ఐదేళ్ల క్రితం కరెంట్ విషయంలో ఆగమాగంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో కరెంట్ ఎక్కువగా వినియోగిస్తుందని తెలంగాణ ప్రాంతంలోనని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడొస్తదో… ఎప్పుడు పోయేదో తెలిసేదని కాదని మండిపడ్డారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పొగిడారు. పెన్షన్ వెయ్యి రూపాయలు అందిస్తున్నామని, మే 1 నుంచి రూ.2000 ఇస్తామన్నారు. రైతు బంధు కింద ఎకరానికి ఇప్పటి వరకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చామని, ఇప్పటి నుంచి ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని ప్రశంసించారు. 

 

New Revenue Law Established in Telangana: KCR

The post దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: