‘రిజిస్ట్రేషన్’లో కొత్త విధానం…

  డాక్యుమెంట్లకు సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానం రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం కాగానే సెల్‌కు సమాచారం ఓటిపి నెంబర్ చూపిస్తనే డాక్యుమెంట్ల అందజేత ఇకపై డాక్యుమెంట్ల కోసం నిరీక్షించాల్సిన పనిలేదు ఖమ్మం : రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత కోసం ఆ శాఖ అనేక సంస్కరణలు తీసుకొస్తోది. ఈ శాఖలో భారీగా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఏసిబి అధికారులు ఇచ్చిన నివేదిక నేపధ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే […] The post ‘రిజిస్ట్రేషన్’లో కొత్త విధానం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డాక్యుమెంట్లకు సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానం
రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం కాగానే సెల్‌కు సమాచారం
ఓటిపి నెంబర్ చూపిస్తనే డాక్యుమెంట్ల అందజేత
ఇకపై డాక్యుమెంట్ల కోసం నిరీక్షించాల్సిన పనిలేదు

ఖమ్మం : రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత కోసం ఆ శాఖ అనేక సంస్కరణలు తీసుకొస్తోది. ఈ శాఖలో భారీగా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఏసిబి అధికారులు ఇచ్చిన నివేదిక నేపధ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే అనధికారి ఉద్యోగులందరినీ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సకాలంలో పొందేందుకు వీలుగా కొత్త విధానంను అమలులోకి తీసుకొచ్చారు.

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్‌కు, భూముల కొనుగోళ్ళు దారిడి సెల్ ఫోన్ నెంబర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇటీవలనే ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో వారి సెల్ నెంబర్‌కు డాక్యుమెంట్ తయారైంది వచ్చితీసుకేళ్ళండి అనే సమాచారం సూచికగా సంబంధిత రిజిస్ట్రార్ దారుడి సెల్ ఫోన్‌కు ఓటిపి నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌ను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపిస్తే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేస్తారు. రిజిస్ట్రేషన్ శాఖలో పాలన పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి పారదర్శతకు పెద్దపీఠ వేయాలనే ఉద్దేశ్యంతో ఇటివలనే ఓటిపి సౌకర్యాన్ని ప్రారంభించింది.

గతంలో ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో అసలుదారుడికి బదులు అప్పు బాకీ ఉన్నవారు, ఇతర వారసులు వచ్చి తమవి కాని వారికి చెందిన డాక్యుమెంట్లను తీసుకేళ్ళే వారు. దీని వల్ల అనేక తలనొప్పులు వచ్చేవి. అలా జరగకుండా ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయిందో వారి సెల్ నెంబర్‌ను రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ల స్కానర్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా వారికి చెందిన డాక్యుమెంట్లు అన్ని తయారైన తరువాత ఆటోమెటిక్‌గా వారి సెల్ నెంబర్‌కు ఓటిపి నెంబర్ వెళ్తుంది. ఈ నెంబర్‌ను సంబందిత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపిస్తే వారికి చెందిన డాక్యుమెంట్లను అందజేస్తారు. గతంలో వీటి కోసం కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగాల్సి వచ్చేది.

ఈ విషయంలో డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎప్పుడు డాక్యుమెంట్లు తయారు అవుతాయో తెలిసేది కాదు. కొత్తగా రూపొందించిన విధానం వల్ల రిజిస్ట్రేషన్ అయిన కొద్ది రోజుల్లోనే సంతకాలు అన్ని పూర్తికాగానే కొనుగోళ్ళు దారుడి సెల్ నెంబర్‌కు ఓటిపి నెంబర్ వెళుతుంది. ఈ నెంబర్ రాగానే కొనుగోళ్ళు దారుడు నెరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంకు వెళ్ళి డాక్యుమెంట్లను తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు ఉన్నప్పటికీ ఇప్పటి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయివేట్ డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడుతూ ఎప్పుడు బిజీగా ఉండే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది రోజు వారి కార్యకలాపాల్లో బిజీగా మారుతున్నారు. దీంతో ముందు రోజు జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై సరైన శ్రద్ధ ఉండటం లేదు.

రిజిస్ట్రేషన్ అయిన తరువాత వారం, పది రోజులకు కొనుగోలు దారుడి చేతికి డాక్యుమెంట్లను అందజేస్తున్నారు. డాక్యుమెంట్లను తీసుకునేందుకు అనేక మంది మద్య దళారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇకపై ఆ ఇబ్బందులను తొలగించేందుకు కొనుగోలు దారుడి సెల్‌కు సమాచారం వస్తుందని, సమాచారం వచ్చిన వెంటనే సంబందిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి సెల్‌కు వచ్చిన ఓటిపి నెంబర్ చూపిస్తే వారికి చెందిన డాక్యుమెంట్లను అందజేస్తారు.

గతంలో డాక్యుమెంట్ల జారీలో అనేక తప్పులు దొర్లేవి, పేరు ఒక్కరిది,స్దలం మరోకరిదిగా ఉండేది. అంతేగాక డాక్యుమెంటేషన్‌లో మొదటి పేజీ ఒక్కరిది, లోపలి పేజీలు మరొకరివి ఉండేవి. ఇలాంటి తప్పులు జరగకుండా డాక్యుమెంటేషన్ స్కానింగ్ సమయంలో సెల్ నెంబర్‌ను అనుసంధానం చేసి కొనుగోళ్ళు దారుడి సెల్‌కి ఓటిపి నెంబర్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం కొనుగోలు దారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఖమ్మం టౌన్ సబ్ రిజిస్ట్రార్ రవీంద్రబాబు ‘మన తెలంగాణ’ ప్రధాన ప్రతినిధి’కి తెలిపారు.

New policy in the Department of Registration

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘రిజిస్ట్రేషన్’లో కొత్త విధానం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: