ఈ సమావేశాల్లోనే కొత్త కార్మిక చట్టం…

  కేంద్ర కార్మిక మంత్రి గంగ్వార్ వెల్లడి నాలుగు కేటగిరీల కింద 44 చట్టాల వర్గీకరణ న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తోడ్పడడంతో పాటుగా వృద్ధి రేటును మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం సరికొత్త కార్మిక చట్టాన్ని తీసుకు రావాలని అనుకుటోంది. ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత మరియు సంక్షేమం పారిశ్రామిక సంబంధాలు అనే నాలుగు కేటగిరీల కింద విలీనం చేసి ఈ కొత్త చట్టాన్ని […] The post ఈ సమావేశాల్లోనే కొత్త కార్మిక చట్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్ర కార్మిక మంత్రి గంగ్వార్ వెల్లడి
నాలుగు కేటగిరీల కింద 44 చట్టాల వర్గీకరణ

న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తోడ్పడడంతో పాటుగా వృద్ధి రేటును మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం సరికొత్త కార్మిక చట్టాన్ని తీసుకు రావాలని అనుకుటోంది. ఇప్పుడున్న 44 కార్మిక చట్టాలను వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత మరియు సంక్షేమం పారిశ్రామిక సంబంధాలు అనే నాలుగు కేటగిరీల కింద విలీనం చేసి ఈ కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. మంగళవారం హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్, వాణిజ్య, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా కొత్త కార్మిక చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడం జరుగుతుందని దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశం అనంతరం గంగ్వార్ విలేఖరులకు చెప్పారు.

ముసాయిదా బిల్లును కేంద్ర మంత్విర్గం ముందుంచడం జరుగుతుందని, ఆ తర్వాత బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బహుశా రెండో వారంలో ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి దేశంలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలను సంప్రదించడం జరుగుతుందని కూడా గంగ్వార్ చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు కేటగిరీలు వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత, సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించి ఉంటాయని అధికారి ఒకరు చెప్పారు. ఉద్యోగుల భవిష్య నిధి చట్ంట, ఇఎస్‌ఐ చట్టం, మెటర్నిటీ ప్రయోజనాల చట్ంట, ఉద్యోగుల నష్టపరిహార చట్టం తదితర చట్టాలు అన్నిటినీ కలిపి ఒకే సోషల్ సెక్యూరిటీ చట్టం లేదా కోడ్‌ను ఏర్పాటు చేస్తారు.

అలాగే ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, డాక్ వర్కర్ల చట్ంట లాంటి పారిశ్రామిక భద్రతకు సంబధించిన పలు చట్టాలను కలిపి పారిశ్రామిక భద్రత, సంక్షేమం పేరుతో ఒకే కేటగిరీని ఏర్పాటు చేస్తారు. అలాగే కనీస వేతనాల చట్టం, వేతనాల చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన వేతన చట్టం లాంటి మరికొన్ని చట్టాలను కలిపి ఒకే కేటగిరీ కిందికి చేరుస్తారు. ఇక చివరగా పారిశ్రామిక సంబంధాల చట్ట్ంటలో పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక ఉపాధి చట్టం లాంటివి కలిసి ఉంటాయి. ప్రతిపాదిత కొత్త కార్మిక చట్టం పెట్టుబడిదారులకు తోడ్పడ్డంతో పాటు వృద్ధి రేటును మరింత వేగవంతం చేస్తుందని ఆ అధికారి తెలిపారు.

New Labor Law for Workers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈ సమావేశాల్లోనే కొత్త కార్మిక చట్టం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: