దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

  రెండు దశాబ్దాల్లో శక్తివంతమైందిగా నమోదు చురుగ్గా సహాయ కార్యక్రమాలు లాస్‌ఏంజిల్స్: దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం పెనుభూకంపానికి గురైంది. గత రెండు దశాబ్దాల్లో ఇంత తీవ్రమైన భూకంపం రాలేదు. ఇక్కడ అంతకు ముందు రోజే వచ్చిన బలమైన భూకంపం నుంచి తేరుకోకముందే 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం తాకిడికి ప్రజలు కకావికలమయ్యారు. ఇక్కడకి 150 మైళ్ల దూరంలో అంతగా జనసాంద్రతలేని మారుమూల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్‌కు ఈశాన్య దిశలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే […] The post దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రెండు దశాబ్దాల్లో శక్తివంతమైందిగా నమోదు
చురుగ్గా సహాయ కార్యక్రమాలు

లాస్‌ఏంజిల్స్: దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం పెనుభూకంపానికి గురైంది. గత రెండు దశాబ్దాల్లో ఇంత తీవ్రమైన భూకంపం రాలేదు. ఇక్కడ అంతకు ముందు రోజే వచ్చిన బలమైన భూకంపం నుంచి తేరుకోకముందే 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం తాకిడికి ప్రజలు కకావికలమయ్యారు. ఇక్కడకి 150 మైళ్ల దూరంలో అంతగా జనసాంద్రతలేని మారుమూల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్‌కు ఈశాన్య దిశలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఇది మరీ లోతుగా రాలేదు. శనివారం ఉదయం ఈ ప్రాంతానికి సహాయక చర్యలకోసం భద్రతా దళాల్ని, అత్యవసర సహాయకుల్ని పంపించారు. శుక్రవారం సాయంకాలం వరకు అందిన సమాచారం ప్రకారం ఎవరైనా మరణించినట్టుకానీ, తీవ్రంగా గాయపడినట్టు కానీ తెలియలేదు.

అయితే ట్రోనా టౌన్‌లో కొన్ని భవనాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని కాలిఫోర్నియా ఎమర్జెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ మార్క్ ఘిలార్డుస్సీ తెలిపారు. గ్యాస్ లీక్‌ల వల్ల కొన్ని చోట్ల మంటలు రేగాయని, నీటి సరఫరాకు, కమ్యునికేషన్లకు అంతరాయం కలిగిందని ఆయన మీడియాకు చెప్పారు. వైట్ హౌస్ నుంచి ఎమర్జెన్సీ ఫెడరల్ సర్వీస్ సహాయాన్ని కోరామని, రాష్ట్ర బృందాలను అప్రమత్తం చేశామని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్ చెప్పారు. శాన్ బెర్నా ఇదుయే కౌంటీలో ఆయన ఎమర్జెన్సీ ప్రకటించారు. సహాయక చర్యలకు హెలికాప్టర్లు, కార్గో విమానాలను రంగంలోకి దించామని నేషనల్ గార్డ్ మేజర్ జనరల్ డేవిడ్ బాల్డ్ విన్ చెప్పారు.

New earthquake strikes Southern California

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.