అభివృద్ధితో పేట జిల్లాను అగ్రగామిగా నిలపాలి: శ్రీనివాస్‌గౌడ్

  అబివృద్దితో పేట జిల్లాను అగ్రగామిగా నిలపాలి అభివృద్దికి బాటలు జిల్లా ఏర్పాటు సాగునీటిని అందించి రైతుల పాదాలు కడుగుతాం మార్చి 31లోపు ఇంటింటికి భగీరథ నీరు వనరులు కల్పించి వలసలను ఆపుతాం ఎన్నికల హామి నెరవేర్చిన సిఎంకు కృతజ్ఞతలు ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, రామన్న, నరేందర్‌రెడ్డి అట్టహాసంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు నారాయణపేట: అభివృద్దితో నారాయణపేట జిల్లాను తెలంగాణలో అగ్రగామిగా నిలపటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని నారయణపేట, మక్తల్, కొడంగల్, మహబుబ్‌నగర్ నియోజకవర్గాల శాసన సభ్యులు ఎస్. […]

 

అబివృద్దితో పేట జిల్లాను అగ్రగామిగా నిలపాలి
అభివృద్దికి బాటలు జిల్లా ఏర్పాటు
సాగునీటిని అందించి రైతుల పాదాలు కడుగుతాం
మార్చి 31లోపు ఇంటింటికి భగీరథ నీరు
వనరులు కల్పించి వలసలను ఆపుతాం
ఎన్నికల హామి నెరవేర్చిన సిఎంకు కృతజ్ఞతలు
ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, రామన్న, నరేందర్‌రెడ్డి
అట్టహాసంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు

నారాయణపేట: అభివృద్దితో నారాయణపేట జిల్లాను తెలంగాణలో అగ్రగామిగా నిలపటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని నారయణపేట, మక్తల్, కొడంగల్, మహబుబ్‌నగర్ నియోజకవర్గాల శాసన సభ్యులు ఎస్. రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 32జిల్లాగా నారాయణపేటను ప్రభుత్వం గుర్తిస్తు జివో విడుదల చేయడంతో జిల్లా ఆవిర్బావ వేడకలు నారయణపేటలో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈసంధర్బంగా జిల్లా కలెక్టర్, ఎస్ పి కార్యాలయాలతో పాటు వివిధ శాఖలకు సంభందించిన కార్యాలయాలను ఇంచార్జి కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఇంచార్జి ఎస్పీ రెమారాజేశ్వరి, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఉదయం కలెక్టర్, ఎస్పీలను బ్రహ్మణులు పూర్ణ కుంభంతో కార్యాలయాల ప్రారంభోత్సవాలకు స్వాగతం పలికారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని రొనాల్డ్‌రోస్ రిబ్బన్‌కట్‌చేసి ప్రారంభించి పూజా కార్యక్రమాలు జరిపించి, తరువాత కలెక్టర్ బాద్యతలను స్వీకరించారు. జిల్లా కార్యాలయం ముందు పోలీసులు కలెక్టర్‌కు గౌరవవందనం సమర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ఎస్ పి కార్యాలయాన్ని ఎస్ పి రెమారాజేశ్వరి ప్రారంభించి భాద్యతలు స్వీకరించిన తరువాత ఎంఎల్ఎలు వారిని అభినందించారు. కలెక్టర్, ఎస్ పి కార్యాలయాల ప్రారంభోత్సవాల సంధర్బంగా ఆయా కార్యాలయాల్లో అన్యమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రారంభోత్సవాల కార్యక్రమం వందేమాతర గీతంతో ప్రారంభం కాగా పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

సాగు నీరందించి రైతుల పాదాలు కడుగుతాం… ఎస్‌ఆర్‌ రెడ్డి
నారాయణపేట నియోజకవర్గానికి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి రైతుల పాదాలు కడుతామని నారాయణపేట ఎంఎల్ఎ ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పేట జిల్లా ఏర్పాటు చరిత్రలో మరవలేనిదని, సిఎం కెసిఆర్ జన్మదినం రోజు జిల్లా ప్రారంభిచటం మంచి పరిణామమన్నారు. కెసిఆర్‌ గారికి కూడా జిల్లా ఏర్పాటు గుర్తుండి పోతుంది. జిల్లా కోసం 2016 నుండి పోరాటాలు జరిగాయని, కొన్ని కారణాల వలన అపుడు కాక పోయినా సిఎం ఇచ్చిన మాట ప్రకారం.. జిల్లా ఏర్పాటు జరుగుతుంది. జిల్లా కోసం తాను అసెంబ్లీలో కూడా మాట్లాడానని సహచర ఉమ్మడి జిల్లా ఎంఎల్ఎలు కూడా తనకు మద్దతు నిలిచారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల అనంతరం 3నెలలలోపు జిల్లా ఏర్పాటు చేస్తానన్న సిఎం కెసిఆర్ గారు హామిని నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. కోయిలకొండ మండలాన్ని అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు మహబుబ్‌నగర్ జిల్లాలోనే ఉంచారని తెలిపారు. జిల్లా ప్రకటించిన అనంతరం కేవలం 18 గంటలలోపే ఆవిర్బావానికి అధికారులు చేసిన ఏర్పాట్లను అభినందించారు. ఇలాగే జిల్లా అభివృద్దికి సహకరించాలన్ని, పేటకు ఘనమైన చరిత్ర ఉందని గత పాలకులు ఈ ప్రాంతాన్ని విస్మరించటం వలనే అభివృద్దికి నోచుకోలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సిఎం ప్రత్యేక గుర్తింపునిస్తున్నారు. వలసల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకునేందుకు అవకాశం అని అందరు కలిసి అభివృద్దికి సహరించాలని కోరారు.

పేటకు మంచి భవిష్యత్ ఉంది… శ్రీనివాస్‌గౌడ్
నారాయణపేట అభివృద్ధి కావటానికి ఇక్కడ మంచి వనరులు ఉన్నాయని, వనరులను ఉపయోగించుకుని జిల్లాను అగ్రగామిగా నిలపాలి. పేట మంచి అభివృద్ది కావటానికి మంచి భవిష్యత్ ఉంది దానికి అందరు సహరించుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ జన్మదినం తెలంగాణలో పండగ వాతారణం ఉందని తమ నాయకుడు వేడుకలు జరపుకోకుండా అవయవదానాలు, రక్తదానం, చెట్లునాటే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సిఎం జన్మదినం రోజు పేట జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగటం శుభపరిణామని ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు జురుపుకోవాలని పిలుపునిచ్చారు.

మానవత్వంతో పనిచేస్తున్నాం… చిట్టెం రామన్న
తెలంగాణ ప్రభుత్వంలో ఎంఎల్ఎలు అందరు రాజకీయాలు చేయకుండా మానవత్వంతో పని చేస్తున్నారని మక్తల్ ఎంఎల్ఎ చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా ఇంత తొందరగా ఏర్పాడడం గొప్ప విషయమని, ఈ ఏర్పాట్లు చూస్తే జిల్లా ఆశ ఎంత ఉందో అర్థమౌతుంది. జిల్లా ఏర్పాటు ఆశామాషి కాదని సిఎం అన్నింటిని అధిగమించి జిల్లాను ప్రకటించారు. సిఎం కెసిఆర్ చెప్పిన మాట నిలబెట్టుకుంటారు. ఈ డివిజన్‌లో నీరు ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో నీటిని వినియోగించుకోలేకపోయామని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మక్తల్‌లో 90వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, మక్తల్‌లో పూర్తిగా వలసలు నిలిచిపోయాయని తెలిపారు. పేట జిల్లా మొక్కను ఇపుడు నాటామని అందరు కలిసి నీరుపోసి పెద్దగా చేసుకోవాలన్నారు. మనం కష్టపడితేనే తెలంగాణ బాగుపడుతుందని, 3ఏళ్ళలో జిల్లాను అభివృద్ది దిశగా తీసుకెళ్ళాలన్నారు.

నిధులు ఎక్కువగా వస్తాయి.. నరేందర్‌రెడ్డి
వెనకబడిన ప్రాంతాన్ని జిల్లాగా చేసుకోవటంలో సఫలీకృతులైన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ జిల్లాగా ఉన్న నారాయణపేట అభివృద్దికి నిధులు ఎక్కువగా వస్తాయని తెలిపారు. అభివృద్దికి ఎమ్మెల్యేలు అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళె దిశగా జిల్లాల విభజన జరిగిందని అన్నారు. సాగునీటిని సాధించి వలసను అడ్డుకుంటామని ధీమావ్యక్తం చేశారు.

మార్చ్ 31లోపు ఇంటింటికి భగీరథ నీరు.. కలెక్టర్
మార్చ్ 31లోపు ప్రతి గ్రామంలో నళ్ళాల ద్వారా ఇంటింటికి భగీరథ నీరు అందించే దిశగా పనులు జరుగుతున్నాయని పేట కలెక్టర్ రొనాల్ట్‌రోస్ అన్నారు. పేట జిల్లా ఏర్పాటు అభివృద్ది దిశగా తీసుకెళ్తుందని అన్నారు. వనరులు ఎక్కువగా ఉన్నాయని జిల్లా ఏర్పాటు జరిగింది కాబట్టి వనలరులను ప్రతిఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా పేటలో అడవి ప్రాంతం తక్కువగా ఉందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి అడవిని పెంచుకవాలని, ముఖ్యంగా ప్రతి గ్రాలమంలో లక్షమొక్కలు నాటే కార్యక్రమం జరుపాలని కోరారు. స్వచ్చభారత కింద ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లు కొత్త కార్యక్రమాలు జరుపాలన్నారు. ప్రజలందరు కలిసి పనిచేస్తే జిల్లా అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. మొదట పెద్దచింతకుంట వాసుకుని ఆపద్బందు పథకం కింద ఇచ్చే ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.

అవసరాలను గుర్తించి తీర్చటానికి ప్రయత్నిస్తాం…ఎస్ పి
ప్రజల అవసరాలను తమ పోలీసులు గుర్తించి తీర్చటానికి ప్రయత్నిస్తారని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. జిల్లా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ పాత జిల్లాలో అభివృద్ది వనరులు ఎక్కువగా లేవని కొత్త జిల్లాకు వనరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అభివృద్ది మంచిగా జరుగుతుందని అన్నారు. కష్టపడి సాధించుకున్న జిల్లాను కష్టపడి పనిచేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో పోలీసులకు శిక్షణలు జరుగుతున్నాయని, ప్రతి ఊరిలో పోలీసులు వచ్చి సమస్యలను గుర్తిస్తారని తెలిపారు. సిబ్బంది తక్కువగాఉన్నా ప్రజాసమస్యలను తీర్చటానికి తమవంతు కృషి చేస్తామన్నారు. పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తే మంచి వాతావరణంలో అభివృద్ది జరుగుతుందని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మెన్ బండారు భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందెఅనుసూయ, మార్కెట్ చైర్మెన్ నాగరాజ్, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డిఓ శ్రీనివాస్‌లతో పాటు వివిధ మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతోపాటు అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

New District Narayanpet Formation Celebrations

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: